Venu Swamy : 2025 లో మహర్జాతకులు వీరే… నా మాటే శాసనం అంటున్న వేణు స్వామి…!
ప్రధానాంశాలు:
Venu Swamy : 2025 లో మహర్జాతకులు వీరే... నా మాటే శాసనం అంటున్న వేణు స్వామి...!
Venu Swamy : కొత్త సంవత్సరం రానే వస్తుంది. అలాగే 2025 సంవత్సరంలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే 2025వ సంవత్సరంలో ఎవరి జాతకం ఏ విధంగా ఉందో ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి వెల్లడించారు. ఇక 2025లో ఏ రాశుల వారికి అదృష్టం పడుతుంది..? అలాగే ఏ రాశి వారు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోబోతున్నారు..? అనే విషయాల గురించి వేణు స్వామి ఏం చెప్పారు ఇప్పుడు మనకు వివరంగా తెలుసుకుందాం…
Venu Swamy వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు 2025 సంవత్సరంలో శని దేవుడు సానుకూలంగా ఉంటాడని వేణు స్వామి వివరించాడు. అలాగే వర్తక వ్యాపారాలు చేసే వారు బారి లాభాలను అందుకుంటారట. ఇక ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వృషభ రాశి జాతకులలో పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఈ సమయంలో వృషభ రాశి వారు భారీ లాభాలను అందుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Venu Swamy : 2025 లో మహర్జాతకులు వీరే… నా మాటే శాసనం అంటున్న వేణు స్వామి…!
మిధున రాశి : 2025 వ సంవత్సరంలో మిధున రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయని వేణు స్వామి తెలిపారు. ముఖ్యంగా మిధున రాశి జాతకులకు రాజయోగం పట్టబోతుందని పేర్కొన్నారు. దీనివలన ఈ సమయంలో మీరు ఏ పని చేసిన అందులో విజయం సాధిస్తారు. అలాగే ఆకస్మిత ధనయోగం కలగబోతుందట. ఉద్యోగుల విషయాని కొస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయని తెలిపారు. అయితే మిధున రాశి జాతకులకు గురుబలం ఉండడంతో సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయని వేణు స్వామి వెల్లడించారు.
Venu Swamy కన్యారాశి
వేణు స్వామి ప్రకారం 2025 సంవత్సరంలో కన్య రాశి జాతకులకు ఆకస్మిత ధన లాభం కలగబోతుందని పేర్కొన్నారు. ఈ సమయంలో వాహన గృహ ఆస్తి లాభాలను పొందుతారట. ఇక వ్యాపారులు భారీ లాభాలను అందుకుంటారని ఇక ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారని తెలిపారు. మొత్తం మీద అద్భుతంగా ఉండబోతుందని వెల్లడించారు.
మకర రాశి : మకర రాశి జాతకులకు 2025 వ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి పొందుతారు. ముఖ్యంగా మకర రాశి జాతకులకు అనుకూలతలు మరియు రాజయోగం పట్టబోతుందట. మకర రాశి జాతకులలో రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు వర్తిస్తాయి. 2025 సంవత్సరంలో మకర రాశి స్త్రీలకు అనుకూలమైన సమయం. అలాగే ఉద్యోగులు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లను అందుకుంటారు. ఇక వర్తక వ్యాపారాలు చేసేవారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయని వేణు స్వామి వెల్లడించారు.