Ayyappa Swamy : శ‌బ‌రిలో అయ్య‌ప్ప స్వామి ఎలా పుట్టాడు.. 150 ఏళ్ల కింద‌ట ఆల‌యం ఎలా వెళిసింది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ayyappa Swamy : శ‌బ‌రిలో అయ్య‌ప్ప స్వామి ఎలా పుట్టాడు.. 150 ఏళ్ల కింద‌ట ఆల‌యం ఎలా వెళిసింది..?

 Authored By prabhas | The Telugu News | Updated on :18 December 2022,4:40 pm

Ayyappa Swamy : మన భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత రద్దీగా ఉండే దేవస్థానం అయ్యప్ప స్వామి శబరిమల క్షేత్రం. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అయ్యప్పలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్మించారట. దట్టమైన అడవిలో కొండలు లోయలు ఉండే ప్రాంతంలోఆలయం ఉండడం వలన ఈ ఆలయాన్ని ఎవరు కట్టారు అనేది, ఎందుకు కట్టారు అనేది నేటికీ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే అప్పట్లో పందల రాజు శబరిమలను పాలించేవారు. కేరళ రాష్ట్రం మొదటి నుంచి అడవి ప్రాంతం గానే ఉంది. అయ్యప్ప స్వామి ఆలయాన్ని కట్టడానికి శబరిమలకు మించిన ప్రాంతం దొరకలేదు. పంబానది ఒడ్డున ఎంతో ఎత్తయిన ప్రదేశంలో ఉన్న శబరిమల అనువైన ప్రాంతంగా గుర్తించిన కొందరు భక్తులు మొదటిగా వెదురుపాకను వేసి అయ్యప్ప స్వామి ని పూజించేవారట. అయితే అయ్యప్ప ఓ రాజకుమారుడు.

అయ్యప్ప స్వామి తండ్రి రాజశేఖరుడు గొప్ప శివ భక్తుడు.ఈయన రాజ్య పాలనలో రాజ్యం సుఖశాంతులతో చల్లగా ఉండేది కానీ ఆ రాజు కుమారులు లేకపోవడం వారికి ఒక బాధ. రాజశేఖరుడు పిల్లల కోసం శివున్ని ప్రార్థించిగా శివుని అనుగ్రహంతో ఓ బిడ్డ నది ఒడ్డున ఆ రాజుకు కనిపిస్తాడు. ఆ బిడ్డను శివుని అంశగా భావించి ఆ బిడ్డను అంతపురంకు తీసుకెళ్తాడు రాజశేఖరుడు .ఇక ఆ బిడ్డకు మణికంఠుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఇక ఆ బిడ్డ వచ్చిన వేల విశేషం ఆ రాజశేఖరుడి యొక్క భార్య మగ బిడ్డ కు జన్మనిస్తుంది. బాల్యంలో ఇద్దరు కూడా పోటాపోటీగా ఎదుగుతారు. అయితే రాజశేఖరుడు మణికంఠుడిని అవతార పురుషుడని ముందే గుర్తిస్తాడు . మణికంఠుని కోరిక మేరకు గురుకులాలో చదువుకోడానికి పంపిస్తాడు రాజశేఖరుడు. తిరిగి వచ్చిన తర్వాత మణికంఠునికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు రాజశేఖరుడు కాని ఆయన భార్యకు మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డ సింహాసనం అధిష్టించాలని కోరిక.

Interesting Facts About Ayyappa Swamy Sabarimala Temple

Interesting Facts About Ayyappa Swamy Sabarimala Temple

దీంతో ఆమె తల నొప్పి గా ఉందని పులిపాలు తెమ్మని మణికంఠుడిని కోరుతుంది. దీంతో మణికంఠుడిని పులి మింగేస్తుందని తన కన్న బిడ్డ రాజవుతాడని ఆమె అభిప్రాయం. కానీ మణికంఠుడు పులిపాలు తేవడం కాదు ఏకంగా ఆ పులిపైన సవారీ చేస్తూ అంతపురంకు వస్తాడు. అయితే మణికంఠుడు రాజ్యాన్ని మాత్రం స్వీకరించలేదు. తిరిగి అడవికి వెళ్ళిపోయి శబరిమలలో అయ్యప్పగా వెలిసాడు. అయితే అడవి వెళ్లి శబరిమల లోనే సరిగ్గా ఆగిపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. తనకు రాజ్యం వద్దని తిరిగి అడవులకు వెళ్ళిపోతానని కోరుతాడు మణికంఠుడు. తాను ఒక బాణంను వదులుతానని ఆ బాణం ఎక్కడైతే వెళ్లి పడుతుందో అక్కడ తనకి గుడి కట్టించమని కోరుతాడు మణికంఠుడు. ఆ విధంగా శబరిమలలో అయ్యప్ప ఆలయం వెలసింది.

కాలక్రమంలో అడవిలో సంభవించే మంటల వలన ఆలయం ధ్వంసం అయ్యేది. స్వామి వారి మూలలకు ఏం కాకపోయేది కానీ పైన కప్పిన గడ్డి మంటల లో కాలి బూడిద అయ్యేది. అలాగే మొదట్లో ఈ ఆలయానికి పరశురాముడు తయారుచేసిన రాతిమెట్లు ఉండేవి. అయితే అన్నీ ఉన్నప్పటికీ అగ్నిప్రమాదం ఎలా సంభవిస్తుందో పూజారులకు అర్థం కాకపోయేది. చివరికి పందల రాజుల చేతిలో ఓ అపురూపమైన కార్యక్రమం చేయాల్సి ఉందని జ్యోతిష్యులు చెప్పారు. అదే అయ్యప్ప స్వామి వారి దేవాలయం. దీంతో అప్పటివరకు ఉన్న శిలా విగ్రహాలను బదులుగా పంచలోహ విగ్రహాలను తయారుచేసి ప్రతిష్టించారు . అలాగే పరుశురాముడు నిర్మించిన రాతిమెట్లకు బదులుగా పంచలోహ మెట్లను తయారు చేశారు. అప్పటినుంచి స్వామి వారి దేవస్థానం కోట్లాది భక్తులతో కలకలాడుతూ వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది