Dogs : కుక్కలు మూలిగినా, ఏడ్చినా ఆపద వస్తున్నట్టేనా?
Dogs : మనుషుల కంటే కూడా కుక్కలు, గ్రామ సింహాలకు ఎక్కువ విశ్వాసం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దాదాపు ప్రతీ ఒక్క ఇంట్లో ఓ కుక్కు ఉండటం సహజమే. ప్రతీ ఇంట్లో కాకపోయినా వాడకు, గ్రామానికి ఇలా చాలా కుక్కలు ఉంటాయి రాత్రిళ్లు ఎవరైనా దొంగతనానికి వచ్చిన వెంటనే అవి అరుస్తూ.. మనుషులను నిద్ర మేల్కునేలా చేస్తాయి. అలాగే దొంగలను వెంటాడి వేటాడి మరీ పట్టుకుంటాయి. మనం తినేటప్పుడు ఓ ముద్ద వాటికి పడేసినా… అవి మనకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తాయి. అందుకే చాలా మందికి కుక్కలు అంటే అమితమైన ప్రేమ. అలాగే పోలీసులు కూడా కుక్కలన ఉపయోగించే నేరస్తులను పట్టుకుంటారు. ఎంత పెద్ద నేరగాళ్లనైనా కుక్కలు వాసన పసిగట్టి పట్టుకోవడం మనం ఎన్నో సందర్బాల్లో చూశాం.
అయితే కుక్కలు మూలిగినా, ఏడ్చినా యమ ధర్మరాజు వస్తున్నట్లుగా భావిస్తారు చాలా మంది. కుక్కలు వాసన చూసి ఎలా చోరులను గుుర్తిస్తాయో… అలానే మానవులకి కనిపించని అనేక దివ్య, దుష్ట శక్తులు కుక్కలకు కన్పిస్తాయి. కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలా సార్లు చాలా చోట్ల మరణాల సంభవించాయి. అందుకే కుక్కలు ఏడుస్తుంటే వాటిని తరిమి కొడ్తుంటారు. వాటికి ఏమైందోనని పదే పదే బయటకు వచ్చి చూస్తుంటారు. అంతేనా వాటిని తమ ఇంటి వద్ద, వాడకట్టు వద్ద ఏడవనీయకుండా చాలా జాగ్రత్తలు తీస్కుంటారు. అయినప్పటికీ కుక్కలు మూలగడం కానీ ఏడవడం కానీ చేస్తే… ఎవరికి ఏం ఆపద వస్తుందోనని భయం భయంగా బతుకుతుంటారు.
ప్రకృతిని, భగవంతుడి ఉనికిని తెలుసుకోవడానికి ఎన్ని జన్మైనా చాలవు. కానీ పశు.. పక్ష్యాదుల్లో కొన్ని అతీత శక్తులు ఉన్నాయి. మానవుడు గుర్తించలేని వాటిని ఎనన్నో కుక్కలు గుర్తిస్తాయి. చెప్పటానికి కుక్కలకి మాట లేదు. ఈ మాటే కుక్కలకి ఉంటే ఈ భూమ్మీద మానవుడు ఉండేవాడు కాదు. కుక్కలకే కాదు ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు. అందుకే భగవంతుడు అన్నీ జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పుట్టించి మాట అనేది ఇచ్చి అందరి కంటే ఎక్కువ చేశాడు. అందుకే కుక్కలు ఏడ్చినా, మూల్గినా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలయినంత వరకు అవి మన ఇంటి వద్ద, వీధి చివరన ఏడవకుండా చూస్కోవాలి.