ప్రణవ ఆకారంలో జ్యోతిర్లిగం … ఓంకారేశ్వరం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ప్రణవ ఆకారంలో జ్యోతిర్లిగం … ఓంకారేశ్వరం !

 Authored By keshava | The Telugu News | Updated on :6 March 2021,8:00 am

Jyotirlinga in Pranava shape : దేశంలో పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాటిలో ఒక్కోదానికి ఒక్కోప్రత్యేకత. వాటిలో సృష్టికి మూలమైన ఓంకారం అంటే ప్రణవ స్వరూపంలో వెలసిన లింగం ఓంకారేశ్వర లింగం. ప్రస్తుతం ఓంకారేశ్వర లింగం గురించి తెలుసుకుందాం…

Jyotirlinga in Pranava shape : పురాణగాథ

సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు. మాంధాత ఇక్కడేపర్వతం పై తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే పర్వతం మీద ఆలయం నిర్మించాడు. ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంలో ఉండే ఓంకారేశ్వర్ దేవాలయం ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది. దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి. వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది.

ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గోప్పవారెవరూ లేరని విర్రవీగురుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారద మహర్షి చెప్పగా, దాంతో కోపం వచ్చిన వింధ్యపర్వత రాజు ఓంకార క్షేత్రానికి వెళ్ళి శివదేవుని పార్థివ లింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు ‘స్వకార్యాని సాధించుకునే శక్తిని ప్రసాదించ’మని వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వారంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు.

Jyotirlinga in Pranava shape Omkareshwar

Jyotirlinga in Pranava shape… Omkareshwar

Jyotirlinga in Pranava shape : వింధ్య గర్వభంగం

శివునినుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడ అడ్డుతగులసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలో తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంత వరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరలా ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరుగలేదు. ఇలా నేటికి వింధ్య పర్వతం మేరు పర్వతం కంటే తక్కువ ఎత్తులోనే ఉంది. నాటి నుంచి నేటి వరకు ఆ వింధ్యరాజు తపస్సు చేసిన ఓంకార క్షేత్రంలో వెలసిన ప్రణవ లింగం ఓంకారేశ్వరుడిగా ప్రసిద్ధి గాంచింది. ఈక్షేత్రలో పవిత్రమైన నర్మదా నది రెండుపాయలుగా చీలి ప్రవహించండ మరో విశేషం. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి రవాణా సౌకర్యం ఉంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉజ్జయిని నగరాలకు ఇది దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి ఈ క్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది