Lord Shiva : ఈ విధంగా పూజ చేయడం వలన తప్పక శివుని అనుగ్రహం కలుగుతుంది..
Lord Shiva : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పూజలు బాగా చేస్తున్నారు. అయితే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క లాగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది వారికి ఇష్టమైన దైవాన్ని పూజిస్తూ ఉంటారు ఇందులో మనం సోమవారం నాడు శివుని పూజిస్తూ ఉంటాం. ఈ శివయ్య కు ఎన్నో పేర్లు ఉన్నాయి. బోలా శంకరుడు, మల్లికార్జున స్వామి, నీలకంఠేశ్వర డు, ఈశ్వరుడు, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి ఇలా ఒక్కొక్క చోట ఒక పేరు ఉంటుంది ఆయనకు సోమవారం నాడు శివయ్యను పూజించడం ఎన్నో సమస్యల నుంచి బయట పడతాం. మన హిందూ సంప్రదాయంలో ఎక్కువగా పిలిచే పేరు ఈశ్వరుడు ఆయనను ఈశ్వర అని పిలిస్తే చాలు తప్పకుండా మన గోడును ఆలకిస్తాడు అంట ఆయనను ఏ విధంగాపూజించాలి…
ఆయనకు చాలా ఇష్టమైన పూజ బిల్వపత్రాలతో పూజ బిల్వపత్రాలపై శ్రీరామ అని రాసి ఆయన లింగం పైన ఉంచడం వలన మనం కోరుకున్న కోరికలును నెరవేరుస్తుంటాడట. మూడు ఆకులు కలిసి ఉన్న బిల్వపత్రాలను ఎక్కువగా పెడుతుండాలి అలాగే కొబ్బరికాయలో ఉండే టి నీరుతో తనకు అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది. శివయ్య కు నంది అంటే చాలా ఇష్టం ఆయన నంది వాహనంపై విహారం చేస్తుంటాడు. అందుకే శివయ్య గుడిలో ఆయన ఎదురుగా ఖచ్చితంగా నంది విగ్రహం ఉంటుంది. మన కోరికలు నంది ఈశ్వరుని చెవులో చెప్తే ఆయన వెళ్లి ఈశ్వరునికి చెప్తాడు.
అంట శివాలయం లోకి వెళ్ళిన వెంటనే గర్భ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు ముందు నందీశ్వరుని దగ్గర ప్రదక్షిణ మొదలు పెట్టి శివుని దగ్గరికి రావాలి ఆయనను నమస్కరించి నందీశ్వరుని దగ్గరికి వెళ్లి ఆ గాలి తర్వాత గర్భగుడి లో లింగాన్ని అభిషేకించి తర్వాత జలం వద్దకు రావాలి. శివయ్యను మల్లె పూలతో, మొగలిపూవులతో ,నాగమల్లి ,సంపంగి ,లాంటి పువ్వులతో అసలు పూజించకూడదు. ఆయనకు ప్రీతికరమైన బిల్వ పత్రాలతో నే మాత్రమే ఎప్పుడు పూజించాలి. చేపట్టిన పనుల్లో సత్వర విజయం సాధించాలి అంటే సరియైన దిశలలో ఆయనను పూజించాలి. ఇలా శివయ్యను పూజించడం వలన ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది.