Lakshmi Devi : ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకొంటే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది ?
Lakshmi Devi : ఇంట్లో ఎటువంటి చెట్లు పెంచుకోవాలి ? ఏవి పెంచుకోవద్దు అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అంతేకాదు ఏ చెట్లను పెంచుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది? ఏవి పెంచుకుంటే మనకు చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం.. ఇంట్లో తప్పనిసరిగా చెట్టు మొక్కలు పెంచుకోవాలి. అయితే పెంచుకోవడం కూడా కొన్ని నియమాలను ఆధారంగా వాటిని పెంచుకోవాలి.
ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కృష్ణ తులసి, లక్ష్మీ తులసిని పెంచుకోవాలి. అంతేకాకుండా మన పెరడు పెద్దదిగా ఉంటే ఉసరిక అంటే ధాత్రి చెట్టును, మారేడు చెట్టును పెంచుకోవాలి. అదేవిధంగా పుష్పించే మొక్కలను పెంచుకోవాలి. నందివర్దనం, గన్నెరు, మందారం, మల్లె, సెంటు మల్లె తదితరాలను పెంచుకోవాలి. అంతేకాకుండా పెంచుకోకూడని చెట్లు రెండు రకాలు అవి పాలు కారేవీ, ముల్లు ఉండేవి ఎట్టి పరిస్థితిలోనూ పెంచకోకూడదు.

Lakshmi Devi Indoor Plants outdoor plants Tips
వీటితోపాటు విశాలమైన పెరడు ఉంటే ముళ్లు ఉన్నా పండ్లును ఇచ్చే చెట్లు నిమ్మకాయ, బత్తాయి, దానిమ్మ చెట్లును పెంచుకోవచ్చు. అంతేకాకుండా వాస్తుదోషాలు పోవడానికి పెంచుకోవాల్సిన చెట్లు, పెంచుకోకూడని ముఖ్యమైన కొన్నిచెట్ల వివరాల కోసం పూర్తి వీడియోను వీక్షించండి.
