Holi Festival : హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం.. మరి దీని ప్రభావం భారతదేశంలో ఎలా ఉండబోతుంది..?
ప్రధానాంశాలు:
Holi Festival : హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం.. మరి దీని ప్రభావం భారతదేశంలో ఎలా ఉండబోతుంది..?
Holi Festival : హిందూ ధర్మశాస్త్రంలో పురాణాలు ప్రకారము గ్రహణాలకి ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రగ్రహణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ చంద్రగ్రహణం, భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యకాంతి భూమి మీద పడుతుంది కానీ చంద్రునిపై పడదు. దీంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటారు. హోలీ పండుగ పౌర్ణమి రోజున వస్తుంది. అసలు చంద్రుడు పౌర్ణమి నాడు చంద్రుడు వెలుతురుని వెదజల్లుతాడు. ఆరోజు నిండు పౌర్ణమి. చంద్రుడు పౌర్ణమి రోజున నిండుగా కనిపిస్తూ వెళుతూరిని ప్రసరిస్తారు. అలాంటి పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడితే, అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరం 2025లో తొలిసారి మార్చి 14న హోలీ పండుగ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.

Holi Festival : హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం.. మరి దీని ప్రభావం భారతదేశంలో ఎలా ఉండబోతుంది..?
మన భారతదేశం సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం అనేది ఉదయం తొమ్మిది గంటల 27 నిమిషాలకు ప్రారంభమై, ఉదయం 11 గంటలకు 56 నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
అయితే చాలామందిలో హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది, దీని ప్రభావం ఎలా ఉంటుందో, అసలు హోలీ పండుగను ఎలా జరుపుకోవాలి ఏమైనా ఆంక్షలు ఉంటాయా..? వారి కోసమే ఈ సమాచారం.. అయితే భారతదేశంపై ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది అని చెబుతున్నారు పండితులు.
ఎందుకంటే గ్రహణ సమయంలో ఇక్కడ పగలు ఉంటుంది కాబట్టి, ప్రభావం భారతదేశంలో ఏమాత్రం ఉండదంట. ఇది ఎక్కువగా ఉత్తర అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలో కనిపిస్తుందట. అందువలన ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్చి 13న హోలీక దహనం, మార్చి 14న హోలీ పండుగను జరుపుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఇంకా గ్రహణం ప్రభావం మన దేశంపై ఉండకపోవడం వలన మేషం నుంచి మీన రాశి వరకు ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు పండితులు చెబుతున్నారు.