Nirjala Ekadashi : మే 31 శక్తివంతమైన నిర్జల ఏకాదశి.. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది..!!
ఈ మాసంలో 31వ తేదీన నిర్జల ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి అంటే నీటిని తాగుకుండా వ్రతం చేసుకోవాలి అని అర్థం. ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆరాధిస్తారో వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈనాడు భూ, కనక ,వస్తు వాహనాలు కొనుగోలు చేయడం వలన బాగా శుభసూచకమని కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని చెప్తుంటారు. జేష్ట మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది మే 31వ తేదీన బుధవారం రోజు నిర్జల ఏకాదశి వచ్చింది. ఏకాదశి తిధి మే 30వ తేదీన మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాలకి మొదలై మే 31 తేదీ మధ్యాహ్నం 1 36 నిమిషాలకు ముగియనుంది.
అయితే ఏదైనా ఉదయం వచ్చిన తిథి ప్రామాణికంగా చెప్తుంటారు. అయితే ఈనాడు ఏకాదశి జరుపుకుంటూ ఉంటారు. సంవత్సరం అంతా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించలేకపోయిన వారు ఈ ఒక్కనాడు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాదంతా పూజ చేసిన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు. నిర్జల ఏకాదశి రోజు ఆహారం మీరు తీసుకోకుండా ఉపవాసం చేస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తుంది. నిర్జల ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణువుని ఆరాధించాలి. విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా నివేదించాలి. విష్ణు పూజలు తులసి లేకపోతే పూజ అసంపూర్ణంగా చెప్పబడుతుంది.
విష్ణు భగవానున్ని పసుపు సమర్పించుకోవాలి. ఉపవాసం పాటించి దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. నిర్జల ఏకాదశి నాడు రావి చెట్టుని పూజించడం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను సమర్పించడం వలన అష్ట ఐశ్వర్యాలు పొందుతారు. అలాగే కుండను దానం చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఈ ఏకాదశి నాడు జలదానం చేసిన అన్నదానం చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. కాబట్టి అందరూ ఈ నిర్జల ఏకాదశి నాడు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుంది.