నవగ్రహ దోషాలు పోవాలంటే ఏం చేయాలి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

నవగ్రహ దోషాలు పోవాలంటే ఏం చేయాలి ?

 Authored By uday | The Telugu News | Updated on :13 February 2021,5:30 am

నవగ్రహ దోషాలు : హిందూధర్మంలో జ్యోతిష్యం అత్యంత ప్రధానమైన భాగం. దీనిలో నవగ్రహాల పాత్ర చాలా కీలకం. జన్మసమయంలో గ్రహస్థితిని బట్టి, గోచారాన్ని బట్టి మనిషి భూత, వర్తమాన, భవిష్యత్‌లను లెక్కిస్తారు. వీటి దోషాలు ఉంటే వాటి కోసం అనేక పరిహారాలను మన పూర్వీకులు చెప్పారు. వాటిలో ప్రస్తుతం ఆయా గ్రహాల దోష నివారణకు చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం…

గ్రహాలలో మొదటిది సూర్యుడు. ఈయననే రవి అని కూడా అంటారు. రవిగ్రహ దోషం ఉన్నవారు గోదుమపిండి, గోధుమరొట్టె, కాషాయం వస్త్రాలు, రాగి, రాగి జావ, మిరియాలు వస్తువులు దానం చేయాలి.ఇక మానసికస్థితి మీద, వివాహాలకు సంబంధం ఉన్న చంద్రగ్రహం గురించి తెలుసుకుందాం.. చంద్రగ్రహ దోషం ఉన్నవారు అన్నదానం, బియ్యం, పాలు, నీళ్ళు, తెలుపు వస్త్రాలు, వెండి వస్తువులు, పొంగళి మొదలగునవి దానం చేయాలి. ఆరోగ్యప్రదాత, ప్రమాదాల నుంచి నివారించే గ్రహం, మంగళస్వరూపుడు, వివాహానికి, సంతానానికి ప్రధానమైన గ్రహం కుజుడు. మంగళుడు.. కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పు, మిరపకాయలు, పచ్చి ఖర్జూర, డేట్స్ సిరప్,బెల్ల,ఎరుపు వస్త్రాలు,వ్యవసాయ పనిముట్లు,శుక్రుడితో కలిసిన సోదరికి వస్త్రాభరణాలు బహుమతిగా ఇవ్వటం.,ఎరుపు రంగు వస్త్రాలు మొదలగునవి దానం చేయటం.

Navagraha Stotram In Telugu

Navagraha Stotram In Telugu

నవగ్రహ దోషాలు : ఈ గ్రహం అనుగ్రహం ఉంటే అన్ని సఫలీకృతాలు

బుధగ్రహ దోషం ఉన్నవారు పెసరపప్పు,ఆకుకూరలు,కూరగాయలు,ఆకుపచ్చ వస్త్రాలు,విద్యార్ధులకు విద్యా సంబంధమైన వస్తువులు ,పుస్తకాలు ఆవుకి పచ్చగడ్డి వెయ్యటం మొదలగునవి దానం చేయవచ్చును. గ్రహాలలో అతిపెద్దది.. అన్ని కార్యాలకు ప్రధానంగా ఈ గ్రహం అనుగ్రహం ఉంటే అన్ని సఫలీకృతం అవుతాయి. గురువుగ్రహ దోషం ఉన్నవారు పండ్లు, తీపి పదార్ధాలు,శెనగ గుగ్గిళ్ళు, ధార్మిక కార్యక్రమాల కోసం దానం,విద్యా,వైద్యం,భోజనం,పసుపు రంగు వస్త్రాలు ,తియ్యని పానియాలు, బఠాని గుగ్గిళ్ళు,దానం చేయవచ్చును.

శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్త్రీలకు సంబందించిన బొట్టు బిళ్ళలు,జడ పిన్నులు, జడ రబ్బర్లు, గోరింటాకు, గోళ్ళ రంగులు, సెంటు,అద్దాలు,దువ్వెనలు,పౌడర్లు,పూలు,డ్రైప్రూట్స్, బొబ్బర్లు, అలచందలు,రంగు రంగుల వస్త్రాలు,మొదలగునవి దాన చేయవచ్చును. ఇక అత్యంత ప్రభావవంతమైన అందమైన గ్రహం శనిగ్రహం ఈ గ్రహం అత్యంత కీలకం.. శనిగ్రహ దోషం ఉన్నవారు వంట నూనె,నువ్వులు,ఇనుము,దేవాలయాలకు సిమెంట్,నీలిరంగు వస్త్రాలు ,కార్మికులకు, పనిచేసేవారికి వస్తు, ధన రూపంలో దానం చేయవచ్చును. రాహుగ్రహ దోషం ఉన్నవారు మినప సున్నిండలు,ఇడ్లీలు,మినపగారెలు,తడిపి నాబెట్టిన మినుములు ఆవుకి పెట్టటం,పొగరంగు వస్త్రాలు దానం చేయవచ్చును. జ్ఞానం, ఆధ్యాత్మికత, మోక్ష ప్రదాతగా పేరుగాంచిన కేతువు.. కేతుగ్రహ దోషం ఉన్నవారు పశువులకు,పక్షులకు,చేపలకు ఆహారం పెట్టటం, ఉలవల పొడిని ఆవులకి పెట్టటం, విచిత్ర వర్ణ వస్తువులు దానం చేయాలి. ఇలా ఆయా గ్రహాలకు పెద్దల చెప్పిన పరిహారాలను పాటించి వాటి దోష తీవ్రతను తగ్గించుకోండి.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది