Navaratri : 8 లక్షల రూపాయల చీరను అమ్మవారికి సమర్పించిన ముస్లింలు…
Navaratri : కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కర్ణాటక జిల్లా మథపరంగా, సున్నితమైన ప్రదేశంగా భావిస్తారు. తరచూ ఈ జిల్లాల్లో మత కల్లోలాలు జరుగుతాయని అంటుంటారు. కానీ అలాంటి అభిప్రాయాలను కొట్టి పారేస్తూ ఇక్కడ కూడా మతసామరస్యం ఉందని చెప్పడానికి మంగళూరులోని ప్రసిద్ధ శారద మహోత్సవమే దీనికి నిదర్శనం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలకు ఈ దేవాలయం సిద్ధమైతే శ్రీ వెంకటరమణ ఆలయంలో సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ ఆరు వరకు మంగుళూరు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం శారద ఉత్సవాలకు అంతా సిద్ధమైంది.
ఇక్కడ ఆలయంలోని శారదా దేవి విగ్రహానికి బంగారు ఎంబ్రాయిడరీ తో కూడిన ఆకుపచ్చ పట్టు చీరను ఓ ముస్లిం కుటుంబం రూపొందిస్తుంది. అమ్మ వారి చీరకు తుది మెరుగులు అమర్చే పనిలో ఈ కుటుంబం నిమగ్నమై ఉంది. 8 లక్షల రూపాయల విలువైన అందమైన చీరతో అమ్మవారిని అలంకరించనున్నట్లు శారద మహోత్సవ కమిటీ తెలిపింది. ఈ శారదా దేవి మహోత్సవాలు 1922 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ క్రమంలో 1988 నుంచి తమ తల్లి జ్ఞాపకార్ధంగా ఓ ముస్లిం కుటుంబం అమ్మవారికి చీరను అందజేస్తున్నారు.
ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన ఐదో తరం వాళ్లు నేత కార్మికులు అమ్మవారికి 8 లక్షల రూపాయల విలువైన చీరను అందజేస్తున్నారు. ముదురు ఆకుపచ్చ రంగు చీరలో దాదాపుగా 2600 బంగారు స్టడ్ లు ఉన్నాయి. అలాగే వెండి బంగారు పూతతో కూడిన జరీతో ఎంబ్రాయిడరీ చేయబడింది. అయితే గతంలో ఈ ముస్లిం కుటుంబీకులు 60, 70 వేల ఖరీదైన చీరను అమ్మవారికి ఇచ్చేవారు. అయితే ఈసారి శారదా దేవి అమ్మవారికి 8 లక్షల విలువైన చీరను రెడీ చేశారు. నవరాత్రుల ఆరవ రోజున అమ్మవారికి ఈ చీరను అలంకరిస్తారు. ఈ సంవత్సరం దేవాలయంలో శతాబ్ది మహోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించాలని శారదా మహోత్సవ కమిటీ నిర్ణయించింది.