Rakhi Festival : రాబోయే రాఖీ పండుగ రోజు అరుదైన యోగాలు…ఈ ఆరు రాశుల వారికి అధిక ధన లాభం…!
ప్రధానాంశాలు:
Rakhi Festival : రాబోయే రాఖీ పండుగ రోజు అరుదైన యోగాలు...ఈ ఆరు రాశుల వారికి అధిక ధన లాభం...!
Rakhi Festival : హిందూ పురాణాలలో భాగంగా హిందువులు జరుపుకునే పండుగలలో రాఖీ పండుగ చాలా ముఖ్యమైనది. అయితే ఈసారి రాబోయే రాఖీ పౌర్ణమి రోజు అరుదైన యోగాలు ఏర్పడనునట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ ఏడాది రాబోయే రాఖీ పౌర్ణమి రోజున ఆకాశంలో బ్లూ మూన్ కనిపించనుంది. దీంతో చాలా యాదృచ్ఛికాలు ఆరోజున సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాఖి పండుగ రోజు రానున్న ఈ విశేష యాదృచ్ఛికాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ పండుగలను శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19న జరుపుకోనున్నారు. మరి సోదర సోదరీమణులు జరుపుకునే ఈ రాఖీ పండుగ రోజు ఎలాంటి యాదృచ్ఛికాలు జరగనున్నాయి…ఏ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..?ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం..
Rakhi Festival బ్లూ మూన్ అంటే..
ఈ ఏడాది ఆగస్టు 19 రాఖీ పండుగ జరుపుకొనున్నారు. అయితే ఈసారి రాఖీ పండుగ రోజు ఆకాశంలో బ్లూ మూన్ కనిపించనుంది. చంద్రుడు తన కక్ష లో తాను తిరుగుతూ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని సూపర్ మూన్ అని పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే దాదాపు 14% పెద్దగా 30% ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అంతేకాక ఒకే నెలలో రెండు పౌర్ణమిలు వచ్చినప్పుడు రెండవసారి వచ్చే పౌర్ణమిని బ్లూ మూన్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ బ్లూ మూన్ అనగానే అందరూ చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడు అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఈ సమయంలో కూడా చంద్రుడు సహజ రంగులోనే దర్శనం ఇస్తాడు. కానీ ఈ సమయంలో చంద్రుడు పెద్ద పరిమాణంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దీనినే మనం బ్లూ మూన్ అని పిలుస్తాం. అయితే చంద్రుడు ఆకాశంలో ఇలా అరుదుగా దర్శనమిస్తాడు కాబట్టి దీనికి బ్లూ మూన్ అని నామకరణం చేశారు.
Rakhi Festival ఈసారి బ్లూ మూన్ ఏ సమయంలో కనిపిస్తుంది అంటే…
ఆగస్టు 19వ తేదీన జరుపుకోబోయే రాఖీ పండుగ రోజు చంద్రోదయం సాయంత్రం 6:56 గంటలకు సంభవిస్తుంది. ఇక రాత్రి11:55 గంటలకు చంద్రుడు ఉచ్చ స్థితిలోకి వస్తాడు . ఇక ఇదే రోజు చంద్రదేవుడు మకర రాశి నుంచి బయలుదేరి సాయంత్రం 6:59 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. చంద్రుని ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. అంతేకాక ఈరోజున రాజ్య యోగం, బుధాదిత్య రాజయోగం ,లక్ష్మీనారాయణ రాజయోగం ,విష రాజయోగం , కుబేర రాజయోగం వంటి అద్భుతమైన కలయికలు రూపొందనున్నట్లు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ఏడాది జరుపుకోబోయే రాఖీ పండుగ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశుల వారికి శుభ ఫలితాలు…
రాఖీ పండుగ రోజు జరగబోయే విశేషమైన కలయికల కారణంగా ఈ 6 రాశుల వారికి అదృష్ట ఫలితాలు కలగనున్నాయి. ఈ రాఖీ పండుగ నుండి మేష, సింహ ,ధనుస్సు, మకర, కుంభ ,మీన రాశి వారి జీవితం చాలా ప్రయోజనాకరంగా మారనుంది. ఊహించని ధన లాభం వీరికి లభిస్తుంది. కొందరు ఉద్యోగస్తుల జీతం కూడా జరగవచ్చు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.