Ratha Saptami : రథ సప్తమినాడు ఇలా చేస్తే ఐశ్వర్యం మీ సొంతం.. వీడియో !
Ratha Saptami : సూర్య భగవానుడు అంటే మనకు కనిపించే ప్రతక్ష్య దైవం. నిత్యం మనకు కనిపించి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే దైవం సూర్యుడు. అయనకు అత్యంత ప్రీతికరమైన మాసం మాఘమాసం. దానిలోనూ రథసప్తమి ఆయనకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 7న రథసప్తమి పర్వదినం వచ్చింది. సోమవారంనాడు రథ సమప్తమి రావడం మరో విశేషం. ఈ రోజున ఏం చేయాలి ? ఏం చేయకూడదు? ఏ విధానంలో సూర్య నారయణస్వామిని ఆరాధించాలో తెలుసుకుందాం.
సూర్యడు నమస్కార ప్రియుడు. ఆయనకు నమస్కారం చేస్తే చాలు అనుగ్రహిస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రం చెప్పింది. ఆరోగ్య కారకుడు సూర్య భగవానుడు. ఆయనను సంవత్సరం అంతా ఆరాధించేది ఒక ఎత్తు అయితే రథసప్తమి నాడు ఆరాధించడం చాలా విశేషం. ఆరోజు ఆయన అనుగ్రహం కోసం చిన్నిచిన్న పద్ధతులు, ఆచారాల ద్వారా ఆయనను సులభంగా, శ్రీఘ్రంగా ప్రసన్నం చేసుకోవచ్చు.
రథ సప్తమి రోజు స్నానం ఎలా చేయాలి? ఎలా పూజ చేయాలి? దానం ఏం చేయాలి? ప్రసాదం ఏం సమర్పించాలో తెలుసుకోవానుకుంటున్నారా అయితే ఇక ఆలస్యం ఎందుకు.. కింది వీడియోను పూర్తిగా వీక్షించండి. నియమాలను పాటించి సూర్య నారాయణుడి అనుగ్రహాన్ని పొందండి.రథ సప్తమి విశేషాలు, ఐశ్యర్యం, ఆరోగ్యం పొందడానికి ఈ కింది లింక్ను క్లిక్ చేసి.. వీడియోను పూర్తిగా వీక్షించండి.