Sankranti Bhogi Ratham Muggu : సంక్రాంతి, కనుమ రోజున రథం ముగ్గును ఇలా మాత్రమే తిప్పి వేస్తారు… కారణం తెలుసా…?
Sankranti Bhogi Ratham Muggu : సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గులతో ఇల్లు కళకళలాడిపోతూ ఉంటాయి. పురాతన కాలంలో గీతల ముగ్గులు ఎక్కువగా వేసేవారు. కానీ మారుతూ ఉన్న కాలం ని బట్టి అందమైన కొత్త కొత్త రకాల డిజైన్స్ వచ్చాయి. పాతకాలంలో ఎక్కువ చుక్కల ముగ్గులను వేసేవారు. మెలికల ముగ్గులు, ఇప్పుడు మాత్రం చుక్కల ముగ్గులే కరువైపోయాయి. అన్ని కొత్త కొత్త డిజైన్స్. అందమైన బొమ్మలతో డిజైన్స్ ముగ్గులను ఎక్కువగా వేస్తున్నారు. మనం వేసే ముగ్గు నీట్ గా అందంగా ఉండాలంటే. ముగ్గులు కలర్స్ నింపిన తర్వాత ఆ డిజైన్ పైనుంచి డబుల్ గీత ముగ్గుతో గీయాలి. ఇప్పుడు మీరు వేసిన ముగ్గు అందంగా నీటుగా కనపడుతుంది. దిద్దిన తర్వాతనే ముగ్గుతో వేయాలి.
Sankranti Bhogi Ratham Muggu కనుమ రోజు రథం ముగ్గును ఎటు తిప్పి వేయాలి
కనుమ రోజు ముగ్గులకి రథం ముగ్గుకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఈ రథం ముగ్గును కనుమ రోజున ఎటు తిప్పి వేయాలి అనే సందేహం కొంతమందికి వస్తుంది.
కనుమ రోజున రథం ముగ్గును, ఇంటి ముంగట వాకిట్లో బయటికి తిప్పి వేయాలి. దీనికి అర్థం, కనుమ రోజున కీడు రథం నుంచి బయటికి వెళ్లిపోతుంది. అని పూర్వికుల నుంచి ఇప్పటివరకు ప్రజల యొక్క విశ్వాసం. అంటే శివుడు కనుమ రోజు రధము ఎక్కి మన ఇంటి వాకిట్లో నుంచి వెళుతూ ఉంటాడు. అని పురాణ గాథలు చెబుతున్నాయి.
Sankranti Bhogi Ratham Muggu సంక్రాంతి పండుగ నాడు రథం ను ఇలా వేయాలి
సంక్రాంతి పండుగ రోజున రథం ముగ్గు నువ్వు ఇంటిలోకి ఆహ్వానిస్తున్నట్లుగా వేయాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో పూజలు చేసుకుంటాము. ఇప్పుడు శివుడు మన ఇంట్లోకి రథంపై వస్తాడని పూర్వికులు పురాణాలలో తెలుపబడింది.
Sankranti Bhogi Ratham Muggu కనుమ రోజున రథం ముగ్గు ఎలా వేయాలి
కనుమ రోజున రథం ముగ్గును, బయటకు పంపుతున్నట్లుగా వేయాలి. ఎందుకంటే శివుడు, రథంపై వచ్చి తిరిగి కనుమ రోజున బయటికి వెళ్తాడు. ఈ సమయంలో మనకి కీడు అనేది వస్తుంది అని పురాణాలు తెలిపారు. కీడు పోవాలి అంటే రథం ముగ్గును బయటికి వేయాల్సి ఉంటుంది. ఇలా వెనక వేయకపోతే మనకి ఇంట్లో కీడు అనేది ఉంటుంది అని అప్పటి ప్రజలు నమ్మేవారు. ఆ నమ్మకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తెలిసినవారు ఇలా వేస్తారు. తెలవని వారు కనుమ రోజు రథం ముగ్గు నువ్వు బయటికి పంపినట్లు మాత్రమే వేస్తూ ఉంటారు. కానీ నిజానికి సంక్రాంతి రోజున రథం ముగ్గును లోపలికి ఆహ్వానిస్తున్నట్లు వేయాలి, కనుమ రోజున రధం ముగ్గును బయటికి పంపుతున్నట్లు వేస్తూ ఉండాలి. రథం ముగ్గు లోపటికి వేయటం వల్ల మన ఇంట్లోకి సిరిసంపదలు సుఖసంతోషాలు భోగభాగ్యాలు వస్తాయి. ఈ రథం పై సూర్యభగవానుడు వస్తాడు. దీంతో మనకు మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. అలాగే రథం ముగ్గును బయటకు వెయ్యాలి. దీనికి కారణం కనుమ రోజున మాంసాహారాలను భుజిస్తారు. కాబట్టి, శివుడు,భాస్కరుడు బయటికి వెళ్లిపోతారు. అందుకనే ముగ్గులు తప్పనిసరిగా బయటికి వేయాలి. లేకుంటే శివుడు ఇంట్లోనే ఉంటే మనకు మాంసాహారాన్ని భుజించుట వలన కీడు వస్తుంది. ఆ కీడు రాకుండా ఉండాలి అంటే, రథం ముగ్గుని బయటికి పంపినట్లు వేయాలి. ఇలా చేస్తే మనకు అన్నీ శుభాలే జరుగుతాయి. రథం ముగ్గుని విధంగా వేసుకోవాలి కనుమ రోజున.