Sankranti Festival : కనుమ చాలా పవిత్రమైన రోజు.. ఆవుకి ఇదొక్కటి పెడితే చాలు.. దరిద్రం పోయి కోటీశ్వరులవుతారు..!!
ప్రధానాంశాలు:
Sankranti Festival : కనుమ చాలా పవిత్రమైన రోజు.. ఆవుకి ఇదొక్కటి పెడితే చాలు.. దరిద్రం పోయి కోటీశ్వరులవుతారు..!!
Sankranti Festival : మూడు రోజులు ముచ్చటైన సంక్రాంతి పండుగ సంబరంలో చివరి రోజును కనుమ పండుగగా జరుపుకుంటూ ఉంటారు. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటి ప్రత్యేకత దేనికి అదే అని చెప్పుకోవచ్చు.. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగ అంటారు. అందరూ చెప్పుకున్నట్లు సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండగ పంటలు పండి పండి చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నకు ఎంతో గొప్ప నేస్తాలు పశువులు. రైతు పొలం దున్ని విత్తనాలు విత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువులు ప్రాధాన్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మొదలైన వాటి వల్ల పాలు కూడా రైతుకు మరొక ఆదాయం చేస్తుంది పశువుల డ పొలాలకు మంచి ఎరువుగా కూడా సహాయపడుతుంది. అన్ని విధాల రైతుకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైనది.. గ్రామాలలో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులు ఒకరిగా చూసుకుంటూ ఉంటారు. అలాంటి పశువులు సంవత్సరం అంతా కూడా తమకు ఎంతో సహాయంగా ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకునే పండగగా ఈ కనుమ.
లేదా పశువుల పండుగలో అంతరార్థం కనుమ పండుగ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి వాటికి స్నానం చేయించి వాటికి పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జల పట్టి కాళ్ళకు మువ్వలు వేస్తారు. పశువుల కొమ్ములను కూడా పదును చేస్తారు. ఆ కొమ్ములకు రంగులు వేస్తారు. ఇలా పశువుల కొమ్ముల నుండి వాటి తోకల వరకు అన్నింటినీ కడతారు.ఇక ఈ పశువుల పండగ సందర్భంగా కాటమరాయుడు అంటే పశువుల దేవున్ని పూజించడం ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువులను కాపాడుతాడని గ్రామస్తులు మరియు రైతుల యొక్క నమ్మకం. అందుకే అలంకరించి పశువులతో ఎద్దులను బండ్ల కు కట్టి పిల్ల పాపలతో సహా కాటమరాయుడు గుడికి లేదా పొలిమేరలో ఉండే గ్రామ దేవత గుడి కి చేరుకొని అక్కడ బోనం అంటే పొంగలి కుండా సమర్పిస్తారు. అలాగే సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా పంటలు పండించాలని మొక్కుకుంటారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండాలని మోక్కుతారు. అప్పుడే గతంలో మొక్కుకున్న మొక్కులను కూడా చెల్లిస్తూ వాళ్ల మొక్కల ప్రకారం కోళ్లు మేకలు, పొట్టేలు బలిస్తారు. ఆ బలి ఇచ్చిన రక్తాన్ని పొంగలి లో కలిపి దేవుడికి నైవేద్యం పెట్టి మిగిలింది తీసుకెళ్లి తమ తమ పొలాల్లో చల్లుతారు. ఈ విధంగా పశువులకు రైతులకు మధ్య ఉన్న బంధం ఈ పండుగ సందర్భంగా వంటలు చేసుకుని ఆరగించే పండగానే ప్రజల్లో ఒక భావన ఏర్పడిపోయింది.
అందుకే ఆ రోజున మాంసాహారాన్ని తింటూ ఉంటారు. ముఖ్యంగా పశువులకు ప్రాధాన్యతను ఇచ్చే పండగ అయినప్పటికీ పశువులను బలిచ్చే సాంప్రదాయం కూడా వచ్చింది.అయితే ఇంతటి విశిష్టత కలిగిన ఈ కనుము పండుగ రోజు కనుక మీరు గొవు ఇది తినిపించారంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. గోమాతకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లు.. అయితే ముఖ్యంగా ఈ యొక్క కనుమ పండుగ రోజు పశువులకు కేటాయించబడిన రోజు పశువుల పండుగ పశువులను అందరూ ప్రేమతో ఆదరించే రోజు. ఈరోజు గనక మీరు గోమాత దగ్గరికి తెల్ల రొట్టెలను కనుక తినిపించారంటే అది మీకు చాలా పుణ్యఫలితాన్ని ఇస్తుంది. రొట్టెలు తినిపిస్తే కనుక మీ జీవితంలో మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఎందుకంటే గోమాత సకల దేవత స్వరూపం కాబట్టి ఒక్క గోమాతకి తల్లి జొన్న రొట్టెలను కనుక మీరు తినిపించారంటే మీ జీవితంలో మీకు పట్టుకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్ష మీకు కలుగుతుంది..