Amavasya : సెప్టెంబర్ 14 పొలాల అమావాస్య రోజు ఉప్పు డబ్బాలో ఈ మూడు వస్తువులు వేయండి చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amavasya : సెప్టెంబర్ 14 పొలాల అమావాస్య రోజు ఉప్పు డబ్బాలో ఈ మూడు వస్తువులు వేయండి చాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :14 September 2023,10:00 am

Amavasya : సెప్టెంబర్ 14 పోలాల అమావాస్య రోజు ఉప్పు జాడిలో ఈ మూడు వస్తువులు వేయండి. వద్దన్నా డబ్బులు మీ ఇంటి తలుపు తడుతుంది. మరి పొలాల అమావాస్య రోజు ఉప్పు జాడిలో ఎలాంటి వస్తువులు వేయాలి. లక్ష్మీదేవి ఎలా అనుగ్రహిస్తుంది అనే విశేషాలు మనం తెలుసుకుందాం. మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు. ఇది ఎవరికి ఇవ్వకూడదు అంటారు. ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేటువంటి నిండుగా ఉండాలి. ప్లాస్టిక్ డబ్బాలో గాని స్టీల్ డబ్బాలో కానీ ఉప్పు నీ భద్రపరచుకోరు. చక్కగా ఒక జాడీలో ఉప్పుని భద్రపరచుకుంటే ఎంతో మంచిది. ఉప్పు అడుక్కి వెళ్ళిపోకుండా ఉప్పు లేదు అనకుండా అయిపోయే స్థితి వరకు తెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా ఉప్పు నిండుగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఉప్పును తెచ్చి ఆ జాడీలో నింపుతూ ఉండాలి.

ఉప్పు లక్ష్మీకి సంకేతం గా ఉంటుంది.. కాబట్టి ఈ లక్ష్మీదేవిని మన ఇంట్లోనే స్థిరంగా ఉంచుకోవాలంటే ఈ ఉప్పు జాడిని చాలా భద్రంగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఉప్పుని కూడా ఎవరికి అప్పు అనేది ఇవ్వకూడదు. ఇకపోతే ఉప్పు జాడిలో ఒక మూడు ముఖ్యమైనటువంటి వస్తువులు వేయటం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఐశ్వర్యవంతులం అవుతారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ 14 అమావాస్య రోజు ఈ ఉప్పు పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఉప్పు జాడిలో ముందుగా అడుగుభాగాన ఒక పసుపు రంగు క్లాత్ ని ఉప్పు జాడిలో వేయాలి. ఉప్పు జాడి అడుగున పెట్టగానే ఆ తర్వాత అందులో 9 వక్కలు కూడా వేయండి. ఈ తొమ్మిది అనేది ఎందుకు అంటే నవదుర్గ చిహ్నంగా ఈ తొమ్మిది వక్కలని చెప్పుకోవచ్చు.

September 14 Polala Amavasya day salt cans just put these three things

September 14 Polala Amavasya day salt cans just put these three things

అలాగే ఈ తొమ్మిది వక్కల్ని వేశాక ఒక పసుపు కొమ్మును కూడా తీసుకొచ్చి పెట్టుకుని పూజ చేసి ఆ పసుపు కొమ్మును కూడా ఈ జాడీలో ఉంచండి. మరి ఈ తొమ్మిది వక్కలు పసుపుకొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాసులో వేయాల్సినటువంటి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటి అంటే ఒక బంగారపు వస్తువు కానీ లేదా వెండి వస్తువు కానీ ఇందులో వేయాలి. ఇది మనం మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం చేసేటువంటి పరిహారం కాబట్టి లక్ష్మీస్వరూపానికి కావలసినటువంటి వస్తువు లక్ష్మీ స్వరూపంగా భావించుటటువంటి వస్తువుల్ని మనం ఇందులో వేస్తున్నాం. అయితే ఎప్పుడైతే మీరు ఉప్పు జాడిలో ఈ వస్తువుల్ని వేస్తారో అవన్నీ వేసేశాక రాళ్ల ఉప్పుని నిండుగా వేయండి.

ఈ రాళ్ల ఉప్పుని మీరు చక్కగా వంటల్లో ఉపయోగించుకోవచ్చు.. ఎప్పుడైతే ఈ ఉప్పు తగ్గుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని నింపుకోవచ్చు. లేదా జాడీని శుభ్రపరచుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ తీసేసి మళ్లీ జాడిని శుభ్రపరుచుకుని శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ ఇదే పద్ధతిలో గురువారం కానీ శుక్రవారం కానీ ఇదే పద్ధతిని కొనసాగించుకోవచ్చు..ఇలా ప్రతినిత్యం చేసే ఆ లక్ష్మీ కటాక్షానికి పాత్రులవుతారు. లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో కొలువై ఉంటుంది. తప్పకుండా మీరు ఐశ్వర్యవంతులవుతారు

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది