మూఢాలు ఏం చేయకూడదు ? ఏం చేయవచ్చు ?
ప్రస్తుతం గురుమూఢమి ప్రారంభమైంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. దీనికి సంబంధించిన విశేషాలు తెలసుకుందాం… 2021 జనవరి 17 నుండి ఏప్రియల్ 30 వరకు శుక్రగురుమౌడ్యమి. ఈ సమయంలో ఏ కార్యాలు చెయ్యాలి? ఏ కార్యాలు చేయరాదు? అనేది చాలామందికి సంశయం.
ఈ శుక్ర,గురు మౌడ్యమిలలో గృహప్రవేశము, వివాహము, ఉపనయనము, దేవాలయప్రతిష్ఠ, దేవాలయ శంకుస్థాపన, గృహ శంకుస్థాపన, బోరువేయుట, బావులుతవ్వుట, చెరువులు,కొనేరులు తవ్వుట, నూతన వాహనాలు కొనుట చేయరాదు. సుమారు 104రోజుల పైన, శుభకార్యములకు ముహూర్తాలు లేవు. అయితే ఫిబ్రవరిలో గురుమూఢమి పోయిన తర్వాత ఒక్కరోజు అంటే ఫిబ్రవరి 13న కొన్ని గంటల సమయం శుభంగా ఉంది. ఆపద్ధర్మంగా కొన్ని అత్యవసర పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా గురుమూఢమి పోయిన తర్వాత కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఉపయనయనాలు, ఎంగేజ్‌మెంట్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇక మూఢమైనా ఈ క్రింది కార్యములు చేసుకోవచ్చును అవి పుట్టిన పల్లిలలకు లేదా జాతకరీత్యా గ్రహాలు బాగులేనివారికి నవగ్రహశాంతులు, నవగ్రహ జపాలు, దానాలు, పూజలు, హోమాలు, అభిషేకాలు, చండీహోమలు, నవవిధ శాంతులు చేసుకోవచ్చు.ఉత్పాతాది దోషములకు శాంతులు, సీమంతము, జాతకర్మ, నామకరణ, అన్న ప్రాశనాది, ఊయలో బిడ్డను ఉంచుటకు, కార్యములు నియత కాలంలో వచ్చును గనుక శుక్ర,గురు మూఢమి వచ్చినా చేసుకోవచ్చు. ఇంటి పైకప్పులు, ఇంటిపై స్లాబులు వేసుకోవచ్చు. కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలుగాని, గృహాలుగాని మరమ్మత్తులు చేసుకోవచ్చు.
పెళ్లిచూపులు చూడవచ్చు. నూతన వ్యాపారం ప్రారంభం చెయ్యవచ్చు. స్థలాలు కొనవచ్చు, రిజిస్టేషన్ చేసుకోవచ్చు.అదేవిధంగా ఆపద్ధర్మంగా అత్యవసరమైన కొన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు అయా ప్రాంత ఆచారాలను, అక్కడ పండితుల సలహాల మేరకు సూచనలు పాటించి శుభఫలితాలు పొందగలరు.