Sravana Masam 2024 : శ్రావణమాసం ప్రారంభం… ఈ వ్రతాలు నోములు చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sravana Masam 2024 : శ్రావణమాసం ప్రారంభం… ఈ వ్రతాలు నోములు చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…!

Sravana Masam 2024 : తెలుగు మాసాలలో 5వ మాసం శ్రావణమాసం. పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణమాసం. అలాగే శ్రావణమాసంలో చేసే పూజలు అత్యంత విసిష్టమైనవి అని శివ కేశవులను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శని […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 August 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Sravana Masam 2024 : శ్రావణమాసం ప్రారంభం... ఈ వ్రతాలు నోములు చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం...!

Sravana Masam 2024 : తెలుగు మాసాలలో 5వ మాసం శ్రావణమాసం. పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణమాసం. అలాగే శ్రావణమాసంలో చేసే పూజలు అత్యంత విసిష్టమైనవి అని శివ కేశవులను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శని వారం ఇలా నెలలో ప్రతి రోజూకి ఒక విశిష్టత కలిగి ఉంది. అయితే ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయని భక్తుల నమ్మకం. శ్రావణమాసం లో వ్రతములు,నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని అంటారు.

శ్రావణమాసం అంటే మహిళలకు పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు వ్రతాలను ఎక్కువ ఆచరిస్తారు. అయితే ఈ వ్రతాలు అన్ని కూడా ఈ నెలలోనే ఉంటాయి. కాబట్టి ఈ నెలను వ్రతాలమాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం. శ్రావణమాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది అని వేద పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇది ఒక గొప్ప పవిత్ర మాసం. అదేవిధంగా ఈ నెలలో వ్రతాలు విశిష్ట పండుగలు కూడా ఉంటాయి. నిజానికి ‘శ్రావణ’ మనే ఈ పేరులోనే వేదకాలమనే అర్ధం ఉంటుంది. కాబట్టి శ్రవణం అంటే “వినుట”అని అర్థం. శ్రావణ పున్నమి కి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పురుషులతో పాటు స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, వ్రతాలు, నోములు మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుకే శ్రావణ మాసంలోని మంగళవారం రోజున కొత్తగా విహహం జరిగిన వధువు చేత మంగళగౌరీ వ్రతమును చేయిస్తారు. అయితే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు చెయ్యాలి అనే నియమం ఉంటుంది.

Sravana Masam 2024 శ్రావణమాసం ప్రారంభం ఈ వ్రతాలు నోములు చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం

Sravana Masam 2024 : శ్రావణమాసం ప్రారంభం… ఈ వ్రతాలు నోములు చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…!

అలాగే ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలను కడతారు. ” యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః ” అంటే ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో అక్కడ దేవతలు నివసిస్తారు. అంటే ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ ఇంటిలో కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అని అంటారు. శ్రావణ మాసంలోనే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. కాబట్టి చాలామంది శ్రీకృష్ణమిని ఘనంగా జరుపుకుంటారు. అలాగే శ్రావణ మాసంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. రైతులు వ్యవసాయం చేయడానికి కావలసిన వర్షాలు కురుస్తాయి. మరియు పాడి పంటలను సంవృద్దిగా ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా అందరికి ఆనందాన్ని ఇచ్చే మాసం శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభం అయింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది