laxmi Devi : ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టాలంటే.. శుక్రవారం ఇలా చేయండి!
laxmi Devi puja : ప్రతీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. అయితే వాటిని తగ్గించుకునేందుకు, ఆ సమస్యలను తీర్చుకునేందుకు మనం ఎంతగానో కష్టపడతాం. కానీ ఆర్థిక సమస్యలు తీరాలంటే డబ్బు ఒక్కటే సంపాదిస్తే సరిపోదు. అది ఇంట్లో నిలిచేలా చేసుకోవాలి. అంటే ఇంటికొచ్చిన ఆ లక్ష్మీ దేవి మనతోనే ఉండేలా చేసుకోవాలన్న మాట. అలా చేయాలంటే… ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవిని ఈ మంత్రాలతో పూజిస్తే.. మంచి జరుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఐశ్వర్య ప్రదాతగా […]
laxmi Devi puja : ప్రతీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటాయి. అయితే వాటిని తగ్గించుకునేందుకు, ఆ సమస్యలను తీర్చుకునేందుకు మనం ఎంతగానో కష్టపడతాం. కానీ ఆర్థిక సమస్యలు తీరాలంటే డబ్బు ఒక్కటే సంపాదిస్తే సరిపోదు. అది ఇంట్లో నిలిచేలా చేసుకోవాలి. అంటే ఇంటికొచ్చిన ఆ లక్ష్మీ దేవి మనతోనే ఉండేలా చేసుకోవాలన్న మాట. అలా చేయాలంటే… ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవిని ఈ మంత్రాలతో పూజిస్తే.. మంచి జరుగుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఐశ్వర్య ప్రదాతగా భావించే శ్రీ మహా లక్ష్మిని శుక్రవారం అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తూ.. అమ్మ వారిని ప్రసన్నం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో డబ్బు నిలవడమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు మనం సొంత అవుతాయి. శుక్ర వారమే అమ్మావారికి పూజ ఎందుకు చేయాలంటే… ఆ రోజు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. సంపదకు నిలయమైన లక్ష్మిదేవి అమ్మవారిని శుక్రవారం పూజించడం
వల్ల మన జీవితంలో సంపదలతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజున లక్ష్మీ దేవిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ పూజిస్తే.. ఆర్థిక సమస్యలు కచ్చితంగా తొలగిపోతాయి.లక్ష్మిదేవి సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత అని హిందువుల నమ్మకం. ఈ కారణంగానే భక్తులు అమ్మవారిని ఎక్కువగా పూజిస్తుంటారు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మంత్రాలు జపిస్తారు. అంతేనా ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి మరీ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. అయితే అమ్మవారు ఎప్పుడూ శుచి, శుభ్రత ఉన్న ఇంట్లోకే వస్తుందట. అందుకే సాయం కాలం ఇళ్లు, వాకిలి ఊడ్చి.. దీపారాధన చేసుకున్నాకే ఇంట్లో లైట్లు వేస్తారు. అయితే ప్రతీ శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన మంత్రాలు చదివితే… అమ్మవారి కటాక్షం కచ్చితంగా లభిస్తుందటా. అయితే అవేవో తెలుసుకుని మనం కూడా చదివి ఆర్థిక మసస్యలను తొలగించుకుందాం.
మహా లక్ష్మికి ఇష్టమైన మంత్రం…
శ్రీ లక్ష్మీ బీజ మంత్రం: శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మాయై నమః |
లక్ష్మీ ప్రార్థన మంత్రం: హలో సర్వగేవనన్ వరదాసి హరే: ప్రియా. |
శ్రీ లక్ష్మీ మహామంత్రం: శ్రీలంకా మహాలక్ష్మీ మహాలక్ష్మీ ఏహియేహి సర్వ సౌభాగ్యం దేహంలో స్వాహా ।
మాతా లక్ష్మి మంత్రాలు: శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ర్మ్ ర్మ్ ఆర్ మహాలక్ష్మి నమః..
శ్రీలంకా మహాలక్ష్మీ: మహాలక్ష్మీ ఏహియేహి సర్వ సౌభాగ్యం దేహంలో స్వాహా ।
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మ్యై నమః ।
పద్మనే పద్మ పద్మాక్ష్మీ పద్మ సంభవ్యే తన్మే భజసి పద్మాక్షి యేన సౌఖ్యం లభమ్యామ్.
ఓం హ్రీం త్రీం హట్.
శుక్రవారం నాడు పైన పేర్కొన్న మంత్రంతో లక్ష్మీ దేవిని పూజిస్తే, ఆ తల్లి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు ప్రశాంతతా చేకూరుతుంది. అయితే ఈ మంత్రం జపించే టప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసును దేవి మీదే లగ్నం చేసి భక్తి శ్రద్దలతో ఈ మంత్రాలను చదవాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం ప్రసాదిస్తుంది. ధన లాభంతో పాటు.. ఆర్ధిక సమస్యలు లేకుండా పోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు.