Bheeshma Ekadashi : నేడే భీష్మ ఏకాదశి.. ఈ పూజలు చేస్తే మీ ఇంట్లోనే లక్ష్మీ దేవి! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bheeshma Ekadashi : నేడే భీష్మ ఏకాదశి.. ఈ పూజలు చేస్తే మీ ఇంట్లోనే లక్ష్మీ దేవి!

Bheeshma Ekadashi : మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. అయితే ఈ రోజే భీష్మ ఏకాదశి. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచిపోయింది. ఒకనాడు.. భీష్ముడు శ్రీ కృష్ణుడిని తలుుకున్నాడు. ఆ విషయం గుర్తించిన కృష్ణ పరమాత్ముడు పాండువలను కూడా […]

 Authored By pavan | The Telugu News | Updated on :12 February 2022,12:00 pm

Bheeshma Ekadashi : మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. అయితే ఈ రోజే భీష్మ ఏకాదశి. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచిపోయింది. ఒకనాడు.. భీష్ముడు శ్రీ కృష్ణుడిని తలుుకున్నాడు. ఆ విషయం గుర్తించిన కృష్ణ పరమాత్ముడు పాండువలను కూడా తన వెంట రమ్మన్నాడు. ఎందుకని ప్రశ్నింగా.. భీష్ముడి గొప్పతనాన్ని వివరించి తీసుకెళ్తాడు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ తాగేందుకు ఉపయోగపడదు. అదే ఈ నీరు వర్షంగా మారి వస్తే..

అందరికీ ఉపయోగపడుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది.అయితే ఈ రోజు విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ… పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.

special puja on bheeshma ekadashi For laxmi devi

special puja on bheeshma ekadashi For laxmi devi

అంతే కాకుండా ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని పెద్దల నమ్మకం. అంతే కాకుండా ఈ రోజున శ్రీ మహా విష్ణువుని పూజించిన వారికి స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు గొడుగు, పాదరక్షలు, రాగి వస్తువులు దానం చేస్తే.. జాతక దోషాలు తొలగిపోతాయని పెద్దలు అంటారు. అన్నదానం చేస్తే.. ఎంతో మేలు. భీష్మఏకాదశి రోజు విష్ణు సంబంధిత ఆలయాలకు వెళ్లి, చేతిలో అక్షితలు, పుష్పాలు పట్టుకొని ఒక్కో ప్రదక్షిణకు మీ చేతిలో ఉన్న పూవులు, అక్షితలు స్వామివారి వద్ద వేస్తే మంచిది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది