Gajakesari Rajayoga : కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం… ఈ రాశుల వారికి కనక వర్షం…!
ప్రధానాంశాలు:
Gajakesari Rajayoga : కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం... ఈ రాశుల వారికి కనక వర్షం...!
Gajakesari Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో గ్రహాల సంచలనం వలన కొన్ని అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. పవిత్రమైన కార్తీక మాసంలో గ్రహాలు కదలిక మరియు సంయోగం కారణంగా విశేషమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇక నవంబర్ నెలలో 15 16 17 వ తేదీలలో వృషభ రాశిలో గురు చంద్రుల యుక్తి జరగబోతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో ఎన్నడూ చూడలేని డబ్బుని వారు ఈ సమయంలో చూస్తారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
Gajakesari Rajayoga మేషరాశి
మేష రాశి జాతకులకు గజకేసరి రాజయోగం కారణంగా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడం మంచిది. నూతన ఆదాయం మార్గాలు తెచ్చుకుంటాయి. ఇక కుటుంబ పరిస్థితులు మెరుగు పడడంతో పాటు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మేష రాశి జాతకులు ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది.
Gajakesari Rajayoga వృషభ రాశి
కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగంతో కారణంగా వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రాధాన్యత పెరగడంతో పాటు ఆదాయానికి లోటు ఉండదు. ఇక వృషభ రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది. అలాగే పిల్లల నుంచి శుభవార్తలను వినే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
Gajakesari Rajayoga కర్కాటక రాశి
గజకేసరి రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి ఆదాయపరంగా కలిసి వస్తుంది. అలాగే ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో లాభాల బాటపడతారు. ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈ సమయంలో శత్రుల పై విజయం సాధిస్తారు.
కన్యారాశి : కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారి భాగ్య స్థానంలో గజకేసరి రాజయోగం ఏర్పడడంతో కెరీర్లు పురోగతి ఉంటుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులకు గజకేసరి రాజయోగం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించడంతో పాటు వేతనాలు పెరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు లేదా విహారయాత్రలకు వెళ్తారు.

Gajakesari Rajayoga : కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం… ఈ రాశుల వారికి కనక వర్షం…!
మకర రాశి : కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే గజకేసరి రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టిన అందులో సఫలం అవుతారు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలలో మకర రాశి జాతకులు ఘనవిజయాలను సాధిస్తారు. అంతేకాదు శత్రువర్గం నుంచి బయటపడతారు. మకర రాశి జాతకుల ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో గృహ వాహన యోగాలు కలిసి వస్తాయి.