Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు…. ఈ రోజున ఈ పిండిని తినాలంటారు ఎందుకు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు…. ఈ రోజున ఈ పిండిని తినాలంటారు ఎందుకు…?

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు.... ఈ రోజున ఈ పిండిని తినాలంటారు ఎందుకు...?

Toli Ekadashi 2025 : ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది కూడా తొలి ఏకాదశి 2025 జులై 6 ఆదివారం నాడు వస్తుంది. సాంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన పండుగలలో తొలి ఏకాదశి పండుగ కూడా ఒకటి.ఇది ప్రతి సంవత్సరము ఆషాడ మాసం శుక్లపక్షంలో వస్తుంది. తొలి ఏకాదశి అనగా పండుగలకు ప్రారంభమని అర్థం. ఏకాదశి వచ్చిన తరువాత అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. అసలు ఏకాదశి అంటే అర్థం 11. అయితే,ఈ రోజున చేయాల్సిన నియమాలు, కొన్ని పనులు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం. తొలి ఏకాదశిని “దేవశయని ఏకాదశి “అని కూడా పిలుస్తారు ఎందుకంటే, ఈరోజు నుండి శ్రీమహావిష్ణువు పాల కడలిపై యోగ నిద్రలోకి వెళతారని నమ్ముతారు. స్వామివారు తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ నాలుగు నెలలు కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో సృష్టి భారం శివుని భుజాలపై ఉంటుందని విశ్వాసం. తొలి ఏకాదశి రోజు నుంచే తెలుగు పండగలు అన్ని వరుసగా మొదలవుతాయి. ఈ పవిత్రమైన రోజున విష్ణు భక్తుల ఉపవాసము ఉండే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు.ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.జాగరణలు కూడా చేస్తారు.పాపాలు తొలగిపోతాయని విశేష ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం…

Toli Ekadashi 2025 తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు ఈరోజున ఈ పిండిని తినాలంటారు ఎందుకు

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి పండుగ ఎప్పుడు…. ఈరోజున ఈ పిండిని తినాలంటారు ఎందుకు…?

Toli Ekadashi 2025  పేలాల పిండిని ఎందుకు తినాలి

తొలి ఏకాదశి నాడు జొన్న పేలాలు పిండి తింటే మంచిదని, ఇది ఆనవాయితుగా కూడా వస్తుంది. దీని, వెనుక పౌరాణిక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి.

పితృదేవతలకు ప్రీతికరమైనది : పేలాల పితృదేవతలకు చాలా ఇష్టమైనవిగా భావిస్తారు. ఈ రోజు నా పేలాల పిండి తింటే పూర్వీకులకు స్మరించుకున్నట్లు ఉంటుందని వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. చాలామంది పితృదేవతల పేరుతో పేలాల పిండిని దానం చేయడం లేదా నైవేద్యంలో సమర్పించడం చేస్తారు.

వాతావరణ మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు : ఏకాదశి వచ్చే సమయానికి, గ్రీష్మ రుతువు ముగిసి, వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. వాతావరణం లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి, వర్షాలు మొదలవుతాయి. మార్పుల సమయంలో మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులను చోటు చేసుకుంటుంది. పెలాల పిండి శరీరానికి అవసరమైన వేడిన అందించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరాల, ఇతర ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షించగలదు. అందుకే, ఈ పేలాల పిండిని తొలి ఏకాదశి రోజున దివ్య ఔషధంగా పనిచేస్తుందని తీసుకుంటారు.

సాత్వికాహారం : ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం తరువాత తీసుకునే ఆహారం. సాత్వికంగా సులభంగా జీలమయ్యేదిగా ఉండాలి. పేలాల పిండి తేలిగ్గా అరిగే, శరీరానికి శక్తినిచ్చే ఆహారం.దీనిని సాధారణంగా బెల్లం తో కలిపి తయారుచేస్తారు. ఇది శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. ఈ కారణాల వల్ల, తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తింటే,కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ప్రశాంతతకు కూడా దోహదపడుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది