Ugadi Festival : ఉగాది పండుగ రోజు ఈ పర్యాయం చేస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది…!
Ugadi Festival : మరి కొన్ని రోజుల్లో తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగాది పండుగ వచ్చే లోపు లేదా ఉగాది పండుగ రోజు మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టడం వలన దరిద్రం తొలిగిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇది గుమ్మానికి కట్టడం వలన మీకు ధన ఆదాయం కలుగుతుందని మీపై ఉన్న చెడు శక్తులు మరియు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మరి ఈ ఉగాది వచ్చేలోపు లేదా ఉగాది పండుగ రోజు మీ ఇంటి గుమ్మానికి ఏం కట్టాలో..? ఏం కడితే మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అయితే ఉగాది పండుగను మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. ఇక ఈ ఉగాది పండుగ రోజు నుండే తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరం మొదలవుతుంది. అలాగే ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకు మొదటి పండుగ. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడితో పండుగను ప్రారంభిస్తారు. ఉగాది పండుగ లో ఉగాది పచ్చడి అనేది చాలా ప్రత్యేకమైనది. ఇక ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అంటే కారం, తీపి ,పులుపు ,వగరు ,ఉప్పు, చేదు, ఈ ఆరు రుచులు కలగలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. అయితే సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్టసుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలనే ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. హిందువులకు ఎంతో ముఖ్యమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ,మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక ఈ పండుగను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉగాదిగా పిలుస్తుంటారు.
అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న ఈ ఉగాది పండుగ రోజు ఇంట్లోని చెడు శక్తులు పోవాలంటే ఖచ్చితంగా ఇది కట్టాల్సిందే. ఇక దీనికోసం మీరు కొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే ఒక ఎర్రని గుడ్డ , కొబ్బరికాయ, 5 పసుపుకొమ్ములు , కొద్దిగా పసుపు , కుంకుమ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ముందుగా కొబ్బరికాయను తీసుకొని కాస్త పసుపును నీటితో కలిపి కొబ్బరికాయకు రాయండి. ఆ తర్వాత కుంకుమతో ఆ కొబ్బరికాయపై స్వస్తిక్ గుర్తు వేయండి. అనంతరం ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయను పెట్టండి. అదేవిధంగా దానిలో ఐదు పసుపుకొమ్ములు కాస్త అక్షింతలు కూడా వేసి మూటలాగా కట్టండి. ఇక ఇప్పుడు ఈ మూటను మీ ప్రధాన ద్వారానికి కట్టండి. ఉగాది పండుగలోపు లేదా ఉగాది రోజు ఉదయం పూట ఈ పర్యాయాన్ని పాటించడం చాలా మంచిది. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని నమ్మకం.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఆధ్యాత్మిక సమాచారాల ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.