Ramayana : కుంభకర్ణుడి 6 నెలల నిద్ర ఎందుకు…! వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ గురించి ప్రస్తావించలేదు ఎందుకు.!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ramayana : కుంభకర్ణుడి 6 నెలల నిద్ర ఎందుకు…! వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ గురించి ప్రస్తావించలేదు ఎందుకు.!?

 Authored By prabhas | The Telugu News | Updated on :27 July 2022,1:00 pm

Ramayana : రామాయణం చదివితే మనిషి ఎలా ఉండాలో తెలుస్తుంది.. అందుకే కష్టాల్లో రామా అనే నామం ఒక్కసారి తలుచుకుంటే.. ఆ బాధలన్నీ తొలగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు.. ఈరోజు మనం రామాయణంలో ఎక్కువ మందికి తెలియని 4 విషయాల గురించి తెలుసుకుందాం..! ఈ విషయాలు కొన్ని పుస్తకాలు గ్రంథాలు, ఆధారం చేసుకుని చెబుతున్నవి..! రామాయణాన్ని వాల్మీకి తరువతా పలువురు పలు రకాలుగా రాశారు.. అందులోని సారాంశాన్ని మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాలను మీతో పంచుకుంటున్నాము.. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి కించపరచాలన్నది కాదు.. శివుడి ధనస్సు పేరేమిటి.!? దశరథునికి నలుగురు కుమారులు కాకుండా ఒక కుమార్తె ఉందనీ మీకు తెలుసా.!? వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ గురించి ప్రస్తావించలేదు ఎందుకు.!? రావణుడు వీణను అద్భుతంగా వాయిస్తాడని తెలుసా.!? ఈ ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.

1. శివుడి ధనస్సు పేరేమిటి.!?

రాముడు స్వయంవరం ద్వారా సీతాదేవిని వివాహమాడారణ సంగతి అందరికీ తెలిసిందే.. ఆ స్వయంవరంలో రాముడు విరిసిన విల్లు శివుడే అని మనందరం వినే ఉంటాం.. ఆ వెళ్ళుని సీతాదేవి స్వయంవరంలో ఎందుకు ఉపయోగించారో మీకు తెలుసా.!? హిందూ పురాణాల ప్రకారం.. శివధనస్సు పరమశివుడి దివ్య ఆయుధం.. ఇది ఎంతో శక్తివంతమైనది.. ఈ విల్లుతోనే శివుడు దక్షయజ్ఞంని సర్వనాశనం చేశాడు.. ఆ తర్వాత దేవతలందరూ శివుడిని మెప్పించి ఈ ఇల్లును సంపాదిస్తారు.. ఈ ధనస్సును మిద్దిలా నగరానికి రాజైన దేవరాధుడికి యజ్ఞఫలంగా ఇస్తారు.. ఈ ధనస్సును పినాకం అని కూడా పిలుస్తారు.. అయితే చిన్నప్పుడు సీతాదేవి ఆడుకుంటూ వెళ్లి ఈ ధనస్సును తన చేతులతో అవలీలగా నెట్టేసిందట.. అప్పుడే తన తండ్రి జనకమహారాజు కి సీతాదేవి ఎంత శక్తిమంతురాలో అర్థమవుతుందట.. అందుకే సీతాదేవిని ఈ ధనస్సు ఎక్కు పెట్టిన వాడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారట.. ఇక రాముడు విష్ణుమూర్తి ఏడవ అవతారం కాబట్టి.. ఈ స్వయంవరం లో పాల్గొని.. మిగిలిన రాజుల ఎవరికీ సాధ్యం కానీ ఆ ధనస్సును సులువుగా ఎక్కుపెట్టి విరిచేస్తాడు.. అలాగే జనకుడు అన్న మాట ప్రకారం సీతాదేవిని రాముడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు..

Unknown Facts Of Ramayana in Telugu

Unknown Facts Of Ramayana in Telugu

2.దశరథునికి నలుగురు కుమారులు కాకుండా ఒక కుమార్తె ఉందనీ మీకు తెలుసా..!?

రామాయణంలో రాముడికి నలుగురు తమ్ముళ్లు ఉన్నారని మాత్రమే చెప్పారు.. కానీ కొన్ని పురాణాల ప్రకారం ఆయనకు శాంత అనే ఒక సోదరి కూడా ఉందనీ తెలుస్తోంది.. దశరధమహారాజు కౌశల్యాల కుమార్తె అయిన శాంత అందరికంటే పెద్దది.. రోమపాదుడు దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారు ఆ పిల్లను దత్తత తీసుకుంటారు.. తర్వాత ఆమె రుష్య శ్రుంగుడునీ పెళ్లి చేసుకుని అంగ దేశానికి రాణి అవుతుంది..

3. వాల్మీకి రామాయణంలో లక్ష్మణరేఖ గురించి ప్రస్తావించలేదు ఎందుకు.!?

రాములవారు సీతాదేవి వనవాసం వెళ్లగా అక్కడ సీతాదేవి ఒక లేడీ పిల్లను చూసి ముచ్చట పడుతుంది.. దానిని తీసుకురావడానికి వెళ్లిన రాముడు సీతాదేవి బాధ్యతను లక్ష్మణుడికి అప్పచెప్తాడు.. అంతలో రాముడి గొంతు పోలిన గొంతుతో ఏదో అరుపులు వినిపిస్తాయి.. ఆ కేకలు విన్న సీతాదేవి మీ అన్నగారు ఏదో ఆపదలో ఉన్నారు వెళ్లి రక్షించమని చెబుతుంది.. కానీ అన్నగారు మీ రక్షణ బాధ్యతను నాకు అప్పచెప్పి వెళ్లారు అని లక్ష్మణుడు అంటాడు.. నిజంగానే రాముడు ఆపదలో ఉన్నాడనుకుని లక్ష్మణుడిని వెళ్ళమని చెబుతుంది.. లక్ష్మణుడు వెళుతూ వెళుతూ ఒక గీతను గీసి ఆ గీతను సీతాను దాటి బయటకు రావద్దు అని చెబుతాడు.. దానినే లక్ష్మణ రేఖను అంటారు.. కానీ వాల్మీకి రచించిన రామాయణంలో ఈ లక్ష్మణ రేఖ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు..

4. రావణుడు వీణను అద్భుతంగా వాయిస్తాడని తెలుసా.!?

రావణుడు అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది అతని 10 తలల గురించే.. రావణాసుడు రాక్షసులకు రాసినప్పటికీ గొప్ప శివ భక్తుడు.. రావడం లేదు కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి.. అయినా వేదాలన్నింటినీ అవపోసన పట్టారు.. భగవద్గీత లాగానే రావణ గీత అని కూడా అనేది ఒకటి ఉంటుంది రావణుడు లక్ష్మణుడికి గీతోపదేశం చేశాడు.. రావనుడు గొప్ప సంగీత కళాకారుడు.. ఈయనకు వీణ అంటే చాలా ఇష్టం.. అంతేకాదు వీణను అద్భుతంగా వాయిస్తాడు.. ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది