Vastu Tips : మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే ఆర్థిక ఇబ్బందులు.. బీ కేర్ ఫుల్..
Vastu Tips : చాలా మంది వాస్తు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండటం మనం చూడొచ్చు. ఎంత పెద్ద ఇల్లు కట్టినప్పటికీ అది వాస్తు ప్రకారం ఉందా? లేదా? అన్న విషయం అయితే, కంపల్సరీగా దాదాపుగా అందరూ చెక్ చేస్తుంటారు. అలా వాస్తు అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఎంతో కొంత పాత్ర పోషిస్తున్నది. ఇకపోతే వాస్తు నిపుణులు, శాస్త్ర పెద్దలు చెప్తున్న దాని ప్రకారం.. ఈ వస్తువులను ఇంటి లోపల ఉంచితే కనుక ఆ ఇంటిలోపల ఆర్థిక సమస్యలతో పాటు తరచూ వివాదాలు వస్తుంటాయట. అవేంటో తెలుసుకుందాం.జ్యోతిష్యులు చెప్తున్న ప్రకారం..
కొన్ని వస్తువులను అస్సలు ఇంట్లో ఉండనీయరాదు. ఒకవేళ పొరపాటున అవి ఉన్నట్లయితే లేనిపోని ఇబ్బందులు రావచ్చునని చెప్తున్నారు. జ్యోతిష్యులు చెప్తున్న ఆ వస్తువులు ఏంటంటే..కాక్టస్ మొక్కలు.. వీటిని ఏదేని రూమ్ లో కాని, బెడ్ రూమ్ లో కాని, మెయిన్ డోర్ వద్ద కాని ఉంచరాదు. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్లేట్లు, కప్పులలో పగుళ్లు ఉన్నట్లయితే వాటిని అస్సలు ఉపయోగించరాదు. అలా వాటిని యూజ్ చేయడం వలన లైఫ్‌లో ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి వాటిని వాడటం వలన హెల్త్ పైన కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు.

vastu tips be careful your home you wil have economical issues
Vastu Tips : వెంటనే ఆ వస్తువులను తీసేయండి..
వాస్తు శాస్త్రం ప్రకారం.. బెడ్రూం మధ్యలో టెలివిజన్ అస్సలు పెట్టొద్దు. అలా ఉంచడం వలన భార్యా భర్తల మధ్య వివాదాలు వచ్చే చాన్సెస్ ఉంటాయి. ఒకవేళ తప్పని పరిస్థితులలో బెడ్ రూంలో టీవీ పెడితే కనుక అది ఆగ్నేయ ముఖంగా ఉంచాలి. ఇకపోతే ఆగిపోయిన వాచ్ అనగా వాల్ క్లాక్ అస్సలు ఉంచరాదు. అలా ఉంచడం వలన ఇంటి లోపల అశుభం కలుగుతుందని వివరిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఎండిపోయిన మొక్కలను కూడా ఇంటి లోపల పెట్టుకోకూడదు. అలా ఉంచడం వలన ప్రతికూల పవనాలు ఇంటిలోని ప్రవహించి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి.. ఎట్టి పరిస్థితులలోనూ ఇంటి లోపల ఎండిన మొక్కలు ఉండకుండా జాగ్రత్త పడాలి.