Vastu Tips : మంచం మీద పొరపాటు ఈ వస్తువులు పెట్టకండి… పెడితే తప్పవు కష్టాలు…
Vastu Tips : వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మంచం మీద పడితే అశుభాలు జరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. కొంతమంది తెలిసి తెలియక కొన్ని రకాల వస్తువులను మంచం మీద పెడుతూ ఉంటారు. అలా తెలిసి తెలియక చేసే పనుల వల్ల వాస్తు దోషాలు తలెత్తడంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. అయితే మంచం మీద కొన్ని రకాల వస్తువులను పెట్టడం వలన ఆర్థిక నష్టాలు వెంటాడుతాయట. మంచం మీద ఎటువంటి వస్తువులు పెడితే ఎటువంటి నష్టాలు వస్తాయో తెలుసుకుందాం. మంచం మీద కొన్ని రకాల వస్తువులను పెడితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంటిని వీడి వెళ్ళిపోతుందంట. మంచం మీద పెట్టకూడని వస్తువులలో పసుపు, కుంకుమలు చాలా ముఖ్యమైనవి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు. మంచం అనేది భోగస్థానం కావడంతో మంచం మీద ఎప్పుడు కూడా అత్యంత పవిత్రంగా భావించే పసుపు కుంకుమలను ఉంచరాదు.
అలాగే మంచం మీద పూజా సామానులను పండ్లు, తమలపాకులను పెట్టకూడదని సూచిస్తున్నారు. అదేవిధంగా భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకువచ్చిన పదార్థాలను కూడా మంచం మీద పెట్టకూడదు. ఇలా పెట్టడం వలన వాటిలో ఉండే దైవికమైన శక్తి నశించి అవి మామూలు వస్తువులుగా మాత్రమే మిగిలిపోతాయని నిపుణులు తెలిపారు. అలా మంచం మీద పెట్టిన వాటిని ఆ తర్వాత మళ్లీ దేవుడికి నైవేద్యం పెట్టిన ఎటువంటి ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. అందుకనే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి నివేదించే పదార్థాలను, దేవుడి దగ్గర పెట్టే సామాన్లను పెట్టకూడదు. అదేవిధంగా ముత్యాలను కూడా ఎప్పుడు మంచం మీద పెట్టకూడదు. మంచం పై సాలగ్రామాలు, రుద్రాక్షలు ఎప్పుడు పెట్టకూడదు. వీటితోపాటు వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కూడా మంచంపై పెట్టకూడదు. మరకత ఆభరణాలను కూడా మంచంపై పెట్టకూడదు.
మంచం పై ఇటువంటి వస్తువులను పెట్టడం వలన ఐశ్వర్యం అంతా కూడా హరించకపోతుందంట. అలాగే చాలామంది ఇళ్లల్లో బీరువాలో నుంచి బంగారు ఆభరణాలు బయటకు తీసిన తర్వాత వాటిని వెంటనే మంచం మీద పెట్టి చూసుకుంటారు. కానీ అలా చేయడం వలన నష్టం వాటిల్లుతుంది. మంచం మీద బంగారం పెట్టడం వల్ల మళ్ళీ మళ్ళీ బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి వస్తుందని అది దోషానికి కారణం అవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా చాలామంది ఆంజనేయ స్వామి ఫోటోను దిండు కింద పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. ఉదయం లేవగానే ఆ ఫోటో చూసి తర్వాత పనులను చేసుకుంటారు. అయితే మంచం మీద దిండు కింద దేవుడు ఫోటోలను పెట్టుకోకూడదు. మంచం ఎప్పుడూ యోగ స్ధానం, కాదని ఐశ్వర్య స్థానం కాదని, అది కేవలం భోగస్థానం మాత్రమేనని చెబుతున్నారు. అందుకే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను పెట్టకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.