Vastu Tips : ఈ వస్తువులను ఇంటి గుమ్మం వద్ద పెట్టారంటే.. కోటీశ్వరులు అవ్వాల్సిందే!

Advertisement

Vastu Tips : మన హిందూ సంప్రదాయాల ప్రకారం.. కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల చాలా శుభం కల్గుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఊ వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు లభిస్తాయట. ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి తోరణం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక, ఆకులతో పాటు చివర్ల వేప రెమ్మలను కూడా పెడ్తారు. అలాగే బంతిపూల మాలను కూడా కడ్తారు. అయితే ఈ ఆకులు ఎండిపోయినపుడు మీరు వాటిని తీసేసి.. మళ్లీ తోరణంగా తాజా ఆకులను పెట్టుకోవచ్చు.

అలాగే ఇంటి గుమ్మానికి రెండు వైపులా శుభ ప్రదమైన గుర్తుని వేయడం మంచిదని భావిస్తారు. ఇది ప్రతికూలత, చెడు నుండి మనల్ని రక్షిస్తుందని నమ్మకం. దీపావళి పూజ సమయంలో ఇంట్లో లక్ష్మీ దేవి పాదాలను ఉంచడం శభశకునంగా భావిస్తుంటారు. వాస్తు శాస్త్రు ప్రకారం మీరు ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీ పాదాల గుర్తులను వేస్కోవచ్చు. ఇది ఇంట్లో సంపద, సంతోషాన్ని సూచిస్తుంది. స్వస్తిక్ చిహ్నం హిందూ మతంలో ప్రతి పనిని ప్రారంభించే ముందు కుంకుమ, గంధాన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లోని సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు.

Advertisement
Vastu Tips people must put this things in door step for get luckey
Vastu Tips people must put this things in door step for get luckey

అంతే కాుకండా ఇంటి ప్రధాన ద్వారం వద్ద అంటే గడపకు ఏదురుగా పైన ఉండే దానికి వినాయకుడిని బొమ్మను చెక్కుతారు. వినాయకుడి ప్రతిమ లేని గడపం ఉండడం మనం ఎక్కువగా చూడలేం. అలాగే వారంలో మనం కల్లాపి చల్లిన ప్రతీ సారి గడపను కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు, కుంకుమలతో కచ్చితంగా ముగ్గు పెట్టాలి. అలా చేస్తే లక్ష్మీ దేవి మన ఇంటికి వచ్చేందుకు ఇష్టపడుతుంది. ఇళ్లు, ఇంటి పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే.. లక్ష్మీ దేవి మన ఇంటికి వచ్చేందుకు, ఇంట్లోనే ఉండేందుకు అంతగా ఇష్టపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. వీలైతే ప్రతిరోజూ దీపారాధన చేయండి. అలా వీలు కాని వారు వారంలో రెండు, మూడు రోజులైన సరే దేవుడి ముందు దీపం పెట్టండి.

Advertisement
Advertisement