Venu Swamy : కొత్త సంవత్సరంలో శని ప్రభావం ఈ మూడు రాశుల వారిపై పడుతుంది.. వీటికి నివారణ చర్యలు తెలిపిన వేణు స్వామి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : కొత్త సంవత్సరంలో శని ప్రభావం ఈ మూడు రాశుల వారిపై పడుతుంది.. వీటికి నివారణ చర్యలు తెలిపిన వేణు స్వామి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :29 November 2022,7:30 am

Venu Swamy : కొత్త సంవత్సరంలో శని దేవుడు ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే ఆ రాశుల వారికి కొంత చెడు జరుగుతూ ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీనరాశి జాతకం తో పాటు ఈ రెండు రాశులలో జన్మించిన వారిని అది 20 సంవత్సరాల వయసు దాటిన వాళ్లపై శని ప్రభావం తీవ్రంగా చూపిస్తుంది. అని తెలియజేయడం జరిగింది. ఈ రాశులకు చెందిన వారు సామాజికంగా, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ,కుటుంబ పరంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వేణు స్వామి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొద్ది రోజులలో కొత్త సంవత్సరం మొదలుకానుంది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 2023 జనవరి 16వ తేదీ నుండి శని గ్రహంలో చాలా మార్పులు వస్తాయని గొప్ప పండిత వేణు స్వామి చెప్పారు.

ఈ క్రమంలో శని ప్రభావం కన్య రాశి, మీన రాశి, కర్కాటక రాశి వారిపై శని ప్రభావం పడుతుందని అంటున్నారు. మరీ ప్రధానంగా కన్య రాశికి చెందిన వారికి జీవితంలో పెను సంచలనాలు చోటు చేసుకోబోతున్నాయని తెలిపారు. అలాగే మీన రాశి వారికి తోపాటు రెండు రాశుల్లో జన్మించిన వారికి అది కూడా 27 సంవత్సరాలు వయసు దాటిన వారిపై శని ప్రభావం తీవ్రంగా పడుతుందని తెలియజేశారు. ఈ రాశులకు చెందిన వారికి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా, న్యాయపరంగా, సామాజికంగా, ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండిత వేణు స్వామి చెప్పారు. కావున ఈ రాశులకు చెందిన వారు సమస్యల ప్రభావం నుండి బయటపడాలి అనుకుంటే వీటి నుంచి బయట పడాలన్న కొన్ని చర్యలను తీసుకోవాలని పేర్కొన్నారు.

Venu Swamy In the new year the influence of Saturn falls on these three signs

Venu Swamy In the new year the influence of Saturn falls on these three signs

పూజ పరిష్కారం : తిరునల్లార్ శనీశ్వర దేవాలయంలో శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన పూజలను చేస్తూ ఉండాలి. అదేవిధంగా శనివారం నాడు రాత్రి అల్పాహారంతో మాత్రమే ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ రాశికి చెందిన వాళ్లు ఎన్నో సమస్యల నుండి బయటపడతారు అని వేణు స్వామి తెలపడం జరిగింది. నివారణ చర్యలు : నలుపు రంగు వస్తువులను అస్సలు వాడవద్దు. శనీశ్వరుడి అనుగ్రహం కోసం దానధర్మాలు చేయడం , శని చాలీసా చదవడం అలాగే ఆవాల నూనె దీపం వెలిగించండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఈ విధంగా చేయడం వలన శని ప్రభావం తగ్గిపోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది