Vidura Niti : జీవితంలో విజయాలని అందుకోవాలి అంటే… ఆ మూడింటిని వెంటనే వదిలేయండి… అని చెప్తున్న విదురుడు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vidura Niti : జీవితంలో విజయాలని అందుకోవాలి అంటే… ఆ మూడింటిని వెంటనే వదిలేయండి… అని చెప్తున్న విదురుడు…

 Authored By aruna | The Telugu News | Updated on :14 August 2022,6:00 am

Vidura Niti : కొందరు జీవించే విధానంలో వారి సుఖసంతోషాలను అడ్డుకునే మూడు విషయాలను గురించి విదుర కొన్ని విషయాలను తెలియజేశారు. వెంటనే ఆ మూడు విషయాలను వదిలేయండి.. విదురుడు మహా తెలివిగలవాడు. ముందు కాలజ్ఞానంలో ఏం జరుగుతుందో చెప్పగలిగే మహానుభావుడు. అలాగే ఏది మంచి, ఏది చెడు అనే కొన్ని విషయాలని కూడా విదుర స్పష్టంగా తెలియజేశారు. విదుర చాలా గొప్ప వివేకవంతుడు, నీతిమంతుడు. అదేవిధంగా ఆయన ఆలోచన గొప్పగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు వలన ఆయన మంత్రిగా హస్తినాపురం కు పనిచేయడం జరిగింది. ఈయన హస్తినకు మహారాజు, దృతరాష్ట్రుడి సంక్షోభంలో ఉన్నప్పుడు గొప్ప మంత్రిగా విధురిని సూచనలను అందుకొని రాజ్యాన్ని పాలించేవాడు.

అలాగే విదురుడు, ధృతరాష్ట్ర నడుమున జరిగిన కొన్ని చర్చలు ను సమాహారాన్ని విదిర్ నీతి అంటారు. ఆయన మహాత్మ విదుర గురించి తెలియజేసిన ఈ విషయాలను అతని కాలంలోనే ఎంతో ప్రాముఖ్యమైనవి. అయితే ఇప్పటి కాలంలో ఆ విషయాలు సరిగ్గా సూట్ అవుతాయి. మన జీవన విధానంలో కొన్ని సంతోషాలను నాశనం చేసే ఈ మూడింటిని గురించి విదుర నీతులు తెలియజేశారు. దురాశ: విదుర చెప్పిన నీతి క్రమంగా అతి ఆశ ఉన్న మనిషి తన దురాశ కారణంగా తప్పు ఏదో, ఒప్పు ఏదో తెలుసుకోలేడు. కాబట్టి అతి ఆశ అనేది అందరికీ చాలా చెడు కరమైనది గా తెలియజేశాడు. దురాశ కలిగిన వ్యక్తి ఆ మనిషి జీవితంలో ఎప్పుడు తృప్తి అనేది ఉండదు. అందుకోసం అత్యాశను వదిలేయాలి. కామం: విధుర తన నీతి ప్రకారం మనిషికి అధికారం ఏ వ్యక్తినైనా వినాశనం ఎదురవుతుంది. కాబట్టి ప్రతి మనిషి వారిలోని కొన్ని కోరికలను కంట్రోల్లో ఉంచుకోవాలి. కామ భావన ఒక మనిషిని మానసికంగా, శారీరకంగా బలహీనుడిగా మారుస్తుంది.

Vidura Niti Leave This Three For Your Success

Vidura Niti Leave This Three For Your Success

కోపం: వీదురుడు తన నీతి గ్రంధంలో తెలియజేసిన ప్రకారంగా కోపం అనేది ఒక మనిషి జ్ఞానానికి, మనస్సాక్షి ఈ రెండిటిని పాడు చేస్తుంది. కోపమనేది ఏ మనిషికైనా ఆలోచించే మనసుని అర్థం చేసుకునే బలాన్ని బలహీనంగా మారుస్తుంది. ఇలాంటి కోపం కారణంగా న్యాయాన్ని నిర్ణయించే స్తోమతను నెమ్మదిగా కోల్పోతాడు. పలుమార్లు కోపంలో పొరపాట్లు కూడా జరిగిపోతూ ఉంటాయి. ఈ కోపం కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకే వీదురుడు కోపాన్ని వినాశనానికి మూలంగా భావించడం జరిగింది. అందుకే కోపాన్ని వెంటనే విడిచి పెట్టాలి. ఇలా విధుర చెప్పిన మూడింటిని వదిలేసినట్లయితే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది