vinayaka chavithi : వినాయక చవతి రోజున పూజలో వాడే 21 పత్రి రకాలు ….వాటి ఔషధ గుణాలు ?
vinayaka chavithi : వినాయక చవతి భాద్ర పద శుద్ధ చవతి నాడు జరుపుకునుటకు విశిష్టమైన రోజుగా పరిగణించడమైనది .ఈ వినాయక చవతిని వర సీద్ధి వినాయక చవతిగా పిలవబడుతుంది . ప్రతి ఏడాది చవతి నాడు వినాయకుని వ్రతమును తోమ్మిది లేదా పదకోండు రోజుల పాటు నియమ నిభందనలతో భక్తి
శ్రధలతో పూజించు వారికి తమ జివితంలో విఘ్నాలు తోలగిపోయి కోరికలు సిద్ధింప్ప చేస్తాడు ఆ వర సిద్ధి వినాయకుడు .
గణేషునికి కుడుములు ఉండ్రాలు అంటే చాలా ఇష్టం . చవతి నాడు ఇవి ఆస్వామి వారికి నైవ్వేద్యముగా పేడతారు . ఇంకా పాయసం , పులిహోర , వడపప్పు , వడలు , పూర్ణాలు ,ధద్ధోజనం , ఉడికించిన శనగ గూగ్గిలూ , వంటివి వినాయకునికి పైవ్వేద్యంగా పేడతారు . అలాగే వినాయకుని పూజలో 21 రకాలా పత్రితో ఆయనకు పూజచేస్తారు . ఈ 21 రకమైన పత్రులు ఒక్కోక్క పత్రి ఒక్కో రకమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి . వినాయకుని పూజకు ఉపయోగించే 21 పత్రులు ఏవి … వాటి యొక్క ఔషధ గుణాలు ఏమిటో తేలుసుకుందాం .
vinayaka chavithi : వినాయక చవతి రోజున పూజలో ఉపయోగించే 21 పత్రి రకాలు ..వాటి ఔషధ గుణాలు :
1) మాచీ పత్రం : (మచ పత్రి , నాచ పత్రి ) : ఈ పత్రి (ఆకు ) సువాసనను వేదజల్లుతుంది . అందుకే దిని వాసనను చూస్తే ఒత్తిడిని ,ఆందోలలను తగ్గించడమే కాక మానసిక ఉల్లాసంను పెంపోందిస్తుంది .
2) దూర్వా పత్రం (గరిక) : మన శరిరంలో రోగ నిరోధక శక్తిని పేంచే గుణమును గరికలో కలిగి ఉంటాయి .
3) అపామార్గ పత్రం ( ఉత్త రేణి ) : ధగ్గు , ఆస్తామా వంటి వ్యాధులను తగ్గించడంలో ఈ ఉత్త రేణి ఆకు బాగా పనిచేస్తాయి .
4)బృహతి పత్రం ( ములక ఆకు ) : ఈ ఆకు శ్వాస కోశ సమస్యలను నయంచేస్తుంది . ముఖ్యంగా ఉబ్బసం ఉన్నవారికి ఈ ఆకును వాడితే మంచి గుణం కనబడుతుంది .
5) దత్తూరా పత్రం ( ఉమ్మేత్త ) : శ్వసకోశ వ్వాధు లను నయంచేయడంలో ఉమ్మేత్త బాగా పనిచేస్తుంది .ముఖ్యంగా ఆస్తమా వ్యాధిని తగ్గిస్తుంది .
6) తులసి పత్రం : (తులసి) : శరిరం ఏప్పుడు వేడిని కలిగి ఉండేవారు ఈ తులసి ఆకులను రోజు నమిలితే శరిరం వేడి తగ్గి చల్లబరుస్తుంది . అలాగే శ్వాస కోశ వ్వాదులను కూడా నయంచేస్తుంది .
7) బిల్వ పత్రం : ( మారేడు ఆకు) : శుగర్ వ్యాధి ఉన్న వారికి మారేడు పత్రం దివ్య ఔషధంగా పనిచేస్తుంది . అలాగే విరేచనాలు (మోషన్స్ ) కూడా తగ్గుతాయి .
8)బదరి పత్రం (రేగు ఆకు ) : చర్మ సమస్యలు ఉన్నవారికి రేగు ఆకు మంచి మేడిసన్ .
9) చూత పత్రం (మామిడి ఆకు ) : నోటి దుర్వాసన , చిగుళ్ళ వాపు వంటి సమస్యలను ఈ మామిడి లేత చిగుళ్లు తగ్గిస్తాయి .
10) కర వీర పత్రం (గన్నేరు ఆకు ) : గడ్డలు , పుండ్లు తగ్గిస్తుంది .అలాగే గాయాలు తగ్గించేందుకు ఈ మొక్క వేళ్ళు , బెరడు ఉపయోగపడతాయి .
11) మరువక పత్రం ( ధవనం ,మరువం ) : ఈ ఆకులు సూవాసనను వేదజల్లుతాయి . విటి వాసనను చేస్తే వేంటనే ఒత్తిడి తగ్గిపోతుంది .
12) శమీ పత్రం (జమ్మి) : నోటి సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది .
13) విష్ణు క్రాంత పత్రం : ఈ ఆకులతో చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది .
14) సిందు వార పత్రం ( వావిలాకు ) : కిళ్ళ వాపు సమస్యలు ఉన్నవారు ఈ ఆకు వాడితే ఉపయోగం ఉంటుంది .
15) అశ్వత్థ పత్రం (రావి ) : చర్మ సమస్యలు ఉన్నవారికి రావి ఆకు మంచి ఔషదంమని చేప్పవచ్చు .
16) దాడిమీ పత్రం ( దానిమ్హ ) : వాంతులు , విరేచనాలు వంటివి అరికట్టడానికి దానిమ్హ మంచి ఔషధము.
17) జాజి పత్రం ( జాజి మల్లె ) : చర్మ సమస్యలు ఉన్నవారికి మరియు స్త్రీ సంబధిత వ్యాదులకు ఈ ఆకు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది .
18) ఆర్జున పత్రం ( మద్ది) : గుండె ఆరోగ్యానికి , రక్తం సరఫరా అయ్యోందుకు ఈ ఆకు ఏంతగానో ఉపయోగసడుతుంది .
19) దేవదారు పత్రం : శరిరంలో ఉష్టోగ్రత (వేడి ) ఎక్కువగా ఉండే వారు దినిని వాడితే ఫలితం ఉంటుంది .
20) గండలి పత్రం (లతా దూర్వా ) : అతి మూత్ర సమస్య ఉన్న వారు ఈ ఆకులను ఉపయోగిస్తారు .
21) అర్క పత్రం (జిల్లెడు) : నరాల బలహినత , చర్మ సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను వాడితే మంచి ఫలితం కలుగుతుంది .
కేవలం ఈ పత్రముల ఔషధ గుణాలను తేలుపుటకు కోరకు వివరించడం జరిగింది . వైద్యుల సలహమేరకు వాడేవి వాడరానివి తేలుసుకోని ఉపయోగించండి.