Krishnashtami : కృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి… కన్నయ్యకు పూజ ఏ విధంగా చేయాలి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Krishnashtami : కృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి… కన్నయ్యకు పూజ ఏ విధంగా చేయాలి..

Krishnashtami : కృష్ణాష్టమి అంటే కృష్ణుడు జన్మించిన రోజుని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ పండుగ శ్రావణమాసంలో రాఖి పండుగ తరువాత జరుపుకుంటూ ఉంటారు. ఈ కృష్ణయ్య కృష్ణ పక్షం అష్టమి తిధినాడు కంసుడి చెరసాలలో జన్మించాడు. కృష్ణుడు మహా విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమని హిందూ పురాణాలు పేర్కొన్నాయి. ఈ పండుగను కొన్ని రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కృష్ణాష్టమి, గోకులాష్టమి, జన్మాష్టమి, అష్టమి రోహిణి అని పిలవబడుతుంది. ఈ పండుగను ఈసారి శ్రావణమాసంలో రాఖీ పండుగ […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2022,7:00 am

Krishnashtami : కృష్ణాష్టమి అంటే కృష్ణుడు జన్మించిన రోజుని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ పండుగ శ్రావణమాసంలో రాఖి పండుగ తరువాత జరుపుకుంటూ ఉంటారు. ఈ కృష్ణయ్య కృష్ణ పక్షం అష్టమి తిధినాడు కంసుడి చెరసాలలో జన్మించాడు. కృష్ణుడు మహా విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమని హిందూ పురాణాలు పేర్కొన్నాయి. ఈ పండుగను కొన్ని రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కృష్ణాష్టమి, గోకులాష్టమి, జన్మాష్టమి, అష్టమి రోహిణి అని పిలవబడుతుంది. ఈ పండుగను ఈసారి శ్రావణమాసంలో రాఖీ పండుగ తర్వాత జరుపుకునే విషయంలో కొద్దిగా గందరగోళం జరుగుతుంది. మత కర్మ నిపుణుడు పండిట్ రమేష్ శ్యామల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 18న గురువారం అర్ధరాత్రి గ్రహస్తులకి కి, 19 ఆగస్టున శుక్రవారం తెల్లవారుజామున అష్టమి సన్యాసులు జరుపుకుంటారని చెబుతున్నారు. అసలు ఈ జన్మాష్టమి అంటే ఏమిటి అనేదాన్ని శాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.. నడుమ రాత్రి వ్యాపిని అష్టమిలో మాత్రమే ఉపవాస పూజలను చేసుకోవాలని కొన్ని గ్రంథాలలో రాశారు.

శ్రీ కృష్ణాష్టమి శుభయోగం: ఏడాది ధ్రువ యుద్ధి యోగ కూడా 18 ఆగస్టు నా జరుపుకునే ఈ కృష్ణ అష్టమి రోజు ఏర్పడుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల 41 నిమిషాల వరకు వృద్ధి యోగంగా ఉంటుందని పండిట్ రమేష్ శ్యామల్ తెలియజేశారు. ఉదయం ఎనిమిది గంటల 41 నిమిషాల తదుపరి ధ్రువయోగం మొదలవుతుంది. ఈ యోగం 19వ తేదీ శుక్రవారం ఆగస్టు రాత్రి 8 గంటల 58 వరకు ఉంటుంది. ఈ రెండు యోగాలలో చేయబోయే పనులను కు శుభ సూచకం అని తెలియజేస్తున్నారు. గ్రహస్తులకు పూజ సమయం 18 ఆగస్టు 2022 రాత్రి 12 గంటల రెండు నుంచి 12:40 వరకు జరుపుకోవచ్చు. సన్యాసులు 19 ఆగస్టు 2022 ఉదయం 5:50 వరకు జరుపుకోవచ్చు. శ్రీ కృష్ణాష్టమి జరుపుకునే సమయం: ఈ ఏడాది 18 ఆగస్టు గురువారం రాత్రి తొమ్మిది గంటల 22 ని “తదుపరి కృత్తిక నక్షత్రం మేషరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు.

When to do Krishnashtami How to do Puja for Lord Krishna

When to do Krishnashtami How to do Puja for Lord Krishna

కావున అష్టమి తేదీ రాత్రి గురువారం రోజున కృష్ణాష్టమి ఉపవాసం ఉండవుచ్చని తెలియజేస్తున్నారు. ఎందుకనగా అష్టమి రాత్రి 9 గంటల 22 నిమిషాల తదుపరి మొదలవుతుంది. 18 ఆగస్టు నుండి 19 ఆగస్టు రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. కృష్ణాష్టమి పూజా విధానం: ఈ కృష్ణ అష్టమి ఎంతో పవిత్రమైనది ఈరోజు కృష్ణుడుని పెరుగు, తేనె, నెయ్యి, పాలు, పంచదార ఇలాంటి వాటితో అభిషేకం చేయించండి. తర్వాత కృష్ణుడి విగ్రహాన్ని స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసి దుస్తులను ఆభరణాలతో అలంకరించి, తర్వాత గంధపు తిలకాన్ని దిద్ది, తర్వాత స్వామివారికి ఇష్టమైన అన్న ప్రసాదాలను సమర్పించాలి. అలాగే కృష్ణుడికి పూజ చేసేటప్పుడు తప్పకుండా తులసి ఆకులతోనే పూజ చేయాలి. కృష్ణాష్టమి రోజున చేసే పూజలు శ్రీకృష్ణ భగవానుడికి తప్పకుండా వేణువు, వైజయంతి మాల వెయ్యాలి. అలాగే శ్రీకృష్ణుని ఎంతో భక్తితో విశ్వాసంతో ఆయనను ఆరాధించాలి. చివరిగా కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా గోవులకి పూజ చేసి సేవ చేయడం వలన శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడిపోతాడని భక్తులు నమ్ముతూ ఉంటారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది