పేరును బట్టి ఏ రుద్రాక్ష ధరించాలో మీకు తెలుసా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పేరును బట్టి ఏ రుద్రాక్ష ధరించాలో మీకు తెలుసా ?

 Authored By uday | The Telugu News | Updated on :24 January 2021,6:00 am

రుద్రాక్ష…. సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. రుద్రాక్ష ధారణ అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత విశేషంగా భావిస్తారు. రుద్రాక్షలు అనేక రకాలు. ఏకముఖి నుంచి ఇరవై రకాలు వరకు ఉంటాయి. అయితే ఎవరు ఏ రుద్రాక్షను ధరించాలో తెలుసుకుందాం.. పండితులు, జ్యోతిషులు చెప్పిన వివరాలను తెలుసుకుందాం.. పంచాంగం ప్రకారం మనం జ్యోతిష్యంలో వాడేవి 27 ప్రధానంగా చెప్తారు. వాటి ప్రకారం 12 రాశులు. ఈ నక్షత్రాల ప్రకారం ఒక్కో నక్షత్రం నాలుగుపాదాలు. వాటిని బట్టి పేర్లు పెట్టుకుంటాం వాటి ప్రకారం…

which Rudraksha to wear by name

which Rudraksha to wear by name

చూ,చే,చో,ల,లీ,లూ,లే,లో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు మూడుముఖాల రుద్రాక్ష గాని,”1″,”3″,”5″ముఖాలు కలిగిన రుద్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును. అదేవిధంగా ‘‘ఈ,ఊ,ఏ,ఓ,వా,వీ,వు,వే,వో’’ ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు ఆరు ముఖాల రుధ్రాక్ష గాని, “4”,”6″,”7″ ముఖాలు కలిగిన రుధ్రాక్షలు థరించాలి. హి,హు,హె,హూ,డా,డి,డూ,డే,డో, ప్రథమ నామాక్ష్రాలు ఉన్న వారు ద్విముఖి రుధ్రాక్ష గాని ,”2″,”3″,”5″, ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచంలాగ గాని ధరించ వచ్చును. కా,కి,కూ,ఖం,ఙ,ఛ,కే,కో,హా ప్రథమ నామాక్షరలు ఉన్న వారు నాలుగు ముఖాల రుధ్రాక్ష గాని,”4′,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలు కవచం లాగ గాని థరించ వచ్చును .

మా,మీ,మూ,మే,మో,టా,టి,టు,టే ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, ఏకముఖి గాని, “1”,”3″,”5″, ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును. రా,రి,రూ,రె,రో,తా,తీ,తూ,తే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, తులా లగ్నం వారికి, రాశి వారికి,భరణి,పుబ్బ,పూర్వషాడ,నక్షత్రాల వారికి”6″ముఖాల రుధ్రాక్ష గాని ,”4′,’6″,”7″ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును. టో,పా,పి,పూ,ష,ణ,ఢ,పె,పో ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కన్య లగ్నం వారికి,రాశి వారికి ,ఆశ్లేష,జ్యేష్ట, రేవతి,నక్షత్రాల వారికి “4”ముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించ వచ్చును. తో,నా,నీ,నూ,నే,నో,య,యి,యు, ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికిమూడు ముఖాల రుధ్రాక్ష గాని,”2″,”3″,”5″ముఖాల రుధ్రాక్షలను కవచంలాగ థరించ వచ్చును.

యే,యో,బా,బి,బు,ధ,భ,ఢ,బే,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు పంచముఖి రుధ్రాక్ష గాని “1”,’3″,”5″ముఖాల రుధ్రక్షలను కవచం లాగ థరించ వచ్చును. బో,జా,జి,జు,జే,జో,ఖా,గ,గి,ప్రథమ నామాక్షరాలు ఉన్న వారు సప్తముఖి రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″,ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించాలి. గూ,గే,గో,సా,సి,సు,సే,సో,దా ప్రథమ నామాక్షరాలు ఉన్న వారికి, కుంభ సప్తముఖాల రుధ్రాక్ష గాని,”4″,”6″,”7″ముఖాలు కలిగిన రుధ్రాక్షలను కవచం లాగ థరించాలి. ద, దు,శ్యం,ఝ,ద,దే,దో, చా,చి, నామాక్షరాలు ఉన్న వారికి, పంచముఖాల రుధ్రాక్ష ని,”2″,”3″,”5″రుధ్రాక్షలను కవచం లాగ ధరించాలి. పైన చెప్పినట్లుగా ఆయా రుద్రాక్షలను వాడితే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా రుద్రాక్షలను ధరించినప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీఘ్రంగా సత్పలితాలు వస్తాయి.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది