కొత్తగా వివాహమైన భార్యాభర్తలు ఆషాడ మాసంలో ఎందుకు కలవకూడదో తెలుసా..?
ఆషాడ మాసంలో అసలు అత్త అల్లుడు ఎదురు పడకూడదు. అత్త ముఖం కోడలు చూడకూడదు. భార్యాభర్తలు కలిసి ఉండకూడదు. అలా చేస్తే అరిష్టం కీడు జరుగుతుంది అని అనడం వింటూనే ఉంటాం. అసలు ఆషాడమాసంలో భార్య భర్తలు ఎందుకు కలుసుకోకూడదు. అత్త ముఖం అల్లుడు ఎందుకు చూడకూడదు. కోడలు అత్తతో కలిసి ఎందుకు ఉండకూడదు. వీటి వెనుక కారణాలేంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆషాడ మాసంలో కొత్త దంపతులు కలిసి ఉండకూడదు అని అంటారు. దీని వెనుక ఒక కారణం కూడా దాగి ఉంది.
పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం. సంపాదన మాట పక్కన పెట్టి తినడానికైనా కాసిన గింజలు ఉండాలని కొత్త వలపు మూజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఈ నిబంధన పెట్టడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కొత్త కోడల్ని కచ్చితంగా పుట్టింటికి పంపుతారు. ఎందుకంటే ఈ నెలలో భార్య భర్తల కలయిక వల్ల గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.వేసవి సమయంలో ప్రసవం జరుగుతుంది. ఇది మరొక కారణం. ఆ సమయంలో డెలివరీ జరిగితే పుట్టిన శిశువుకు తల్లికి కూడా వేసవికాలం ఇబ్బందిగా ఉంటుంది. ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చల్లని వాతావరణం వస్తే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం.
ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలలో వధువు పుట్టింట్లో ఉండటమే క్షేమమని మన పెద్దలు ఆచారంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే పూర్వకాలంలో కొత్తగా పెళ్లి అయిన యువకులు 6 నెలల పాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి పని చేయవలసిన యువకులు అత్తవారింట్లోనే కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో జరగవు వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా కూడా ఆకలితో మాడిపోవాల్సిందే అందుకే కొత్తకోడలు పుట్టింట్లో ఉండాలి.
అల్లుడు అత్తవారింటి వైపుకు చూడకూడదు. అనే నియమం పెట్టారు. హిందూ ధర్మంలోని పంచాంగం ప్రకారం ఆషాడమాసం అనేది నాలుగో నెల పండితుల ప్రకారం ఆషాడమాసాన్ని ఆదిమాసం అని పిలవడం జరుగుతుంది. పూజించటానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పూజలు దేవతారాధన చేస్తే హిందువులు ఈ నెలలో పెళ్లిళ్లు మాత్రం చేయరు. అలాగే కొత్త ఇంట్లో కూడా అడుగుపెట్టారు. అంతేకాదు ఎలాంటి శుభకార్యాలుకు శంకుస్థాపన కూడా చేయరు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా కూడా వాయిదా వేసుకోవడమే జరుగుతుంది.