ఈశాన్యంలో బరవులు ఎందుకు పెట్టకూడదు ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఈశాన్యంలో బరవులు ఎందుకు పెట్టకూడదు ?

 Authored By keshava | The Telugu News | Updated on :4 February 2021,5:00 am

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు, గుడి, కార్యాలయం ఏదైనా నిర్మాణం చేస్తే తప్పక వాస్తు నియమాలను పాటిస్తారు. దీనికి కారణం ఒక్కటే గాలి, వెలుతురు ధారళంగా రావడానికి ఈ నియమాలను మన పూర్వీకులు ఏర్పాటుచేశారు. దీనిలో ప్రధానంగా ఈశాన్యం గురించి తెలుసుకుందాం…. ఎక్కువమంది ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది. ఈశాన్యంలో బరువులు పెడితే ఏం జరుగుతుంది ? దీనివల్ల ధననష్టం కలుగుతుంది.

దీనికి కారణం ఈశాన్యంలో సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఈశాన్యంలో బరువులు లేదా వస్తువులు పెట్టడం ద్వారా ఈశాన్య దిక్కు మూసుకుపోతుంది. అక్కడ నుంచి వచ్చే గాలి, వెలుతురు సరిగా రాదు. ప్రాతఃకాలంలో సూర్యోదయం సమయంలో ఈశాన్యం, తూర్పు నుంచి వచ్చే సూర్మరశ్మి ఇంట్లోకి రావడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అందుకోసమే ఈశాన్య దిక్కులో ఎటువంటి వస్తువులు పెట్టుకోకుండా ఖాళీగా ఉంచాలి అని పెద్దలు చెబుతుంటారు.

why not put weights in the northeast

why not put weights in the northeast

ఈశాన్య భాగ దిక్పాలకుడు ఎంతో సున్నితత్వం కలవాడు కాబట్టి ఈశాన్యం వైపు గరికపోచ బరువు కూడా ఉండకూడదు అని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈశాన్యంలో ద్వారం అది వీలుకాకుంటే కనీసం పెద్దకిటికీలు పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఈశాన్య నుంచి వచ్చే వాయువుల వల్ల మనసు తేలికవుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదు. కావాలంటే మీరు ప్రాక్టికల్‌గా అక్కడ నుంచి వచ్చే గాలి, వెలుతురును పరిశీలించండి. తర్వాతనే వాస్తుకు విలువ ఇవ్వండి.

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది