Rakhi Pournami 2023 : ఈసారి రాఖీ పౌర్ణమి భద్ర ముహూర్తంలో వచ్చింది.. పొరపాటున కూడా ఈ సమయంలో రాఖీ అస్సలు కట్టకండి..
Rakhi Pournami 2023 : 2023వ సంవత్సరంలో రాఖీ పౌర్ణమి విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. అసలు రాఖీ పండుగ ఏ రోజు జరుపుకోవాలి. 30, 31 తేదీల్లో కూడా మనకి పౌర్ణమితి కనిపిస్తోంది. అయితే ఈ రెండు రోజుల్లో ఏ రోజు రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి. ఏరోజు సోదరులకు రాఖీ కట్టాలి. అనేటువంటి సందేహం ఈరోజు అందరిలోనూ కనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈసారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి. ఏ విధంగా ఈ పండుగను జరుపుకుంటే అన్నాచెల్లెళ్ల మధ్య లేదా సోదర సోదరీమణుల మధ్య ఉండేటటువంటి బంధం కలకాలం ఉంటుంది. అలాగే ఈసారి భద్ర ముహూర్తం లో అస్సలు రాఖీ కట్టకూడదు. ఆ ముహూర్తం ఏంటి ఒకవేళ ఆ సమయంలో రాఖీ కడితే ఎలాంటి దుష్ప్రభావాలు మీ సోదర సంబంధం లో కలగచ్చు.
ఈ రాఖీ పండుగ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు అందరు ఒక దగ్గర కలుసుకొని మీకు మేము మాకు మీరు కష్టాల్లో ఒకరికొకరు అండగా ఉంటాము. అని భరోసా ఇంచుకునేటువంటి అనుబంధాలకి ప్రత్యేకగా నిలిచేటువంటి ఎన్నో గొప్ప పండుగలు ఇది కూడా ఒకటి. ఈ పండుగని సాధారణంగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకుంటాం. దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు ప్రేమానురాగాలకు ప్రతీకరణ జరుపుకునేటువంటి ఈ పండుగను జరుపుకునే విధానంలో అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ సంవత్సరం అధిక శ్రావణం వచ్చింది.
సాధారణంగా ప్రతి సంవత్సరం ఒకటే శ్రావణమాసం కనిపిస్తుంది. ఆ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రాఖీ పండుగ జరుపుకుంటాం.. ఈసారి మాత్రం అధిక శ్రావణమాసం రావడం లో పౌర్ణమి రెండు రోజులు కనిపించడం 30వ తారీకు అలాగే 31వ తారీకు రెండు రోజుల్లో కూడా పౌర్ణమిత్రులుగా అనిపించడం వల్ల అసలు ఎప్పుడు రాఖీ కట్టాలి.. ఒకవేళ ఆ సమయంలో గనక రాఖీ కడితే అది ఏం జరుగుతుంది… ఆగస్టు 30వ తేదీన రాత్రి 9 గంటల ఒక నిమిషం నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 31వ తేదీ ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా మీ సోదరుడికి రాఖీ కట్టుకోవచ్చు.
30వ తారీకు రాత్రి 9:00 దాటిన తర్వాత నుంచి 31 వ తారీకు ఉదయం 75 నిమిషాల వరకు సాధారణంగా అంత పొద్దున్నే 7:00 లోపు పూజ కార్యక్రమం చేసుకొని సోదరుని కలిసి రాఖీ కట్టడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే 30వ తారీకు రాత్రి ఈ పండుగని జరుపుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఈ పండగ వాతావరణం హడావుడి ఉంటుంది. ఏదైనా ఒక తీపి పదార్థాన్ని మీ సోదరుడికి తినిపించి తర్వాత ఈ రక్షాబంధన్ కట్టి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఈ రాఖీ పండుగని అందరూ ఆనందంగా జరుపుకోండి..