Vinayaka Chavithi : వినాయక చవితి నాడు గణేశుడిని ఆరాధిస్తే… ఈ 5 శుభ ఫలితాలు పొందుతారు..
Vinayaka Chavithi : హిందూమత పురాణాల ప్రకారం వినాయకుని ఎంతో గొప్పగా పూజిస్తూ ఉంటారు. వినాయక చవితి ఎప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వస్తు ఉంటుంది. అప్పుడు ఎంతో అంగ రంగ వైభవంగా సంబరాలు చేస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. ఆయనని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. లంభోదరుడు, విజ్ఞాధిపతి, గజనానుడు, గణేశుడు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అలాగే సనాతన సాంప్రదాయంలో గణపతి అదృష్ట దేవుడిగా పరిగణించబదంది. వినాయకుడిని పూజించడం వలన ఆయన తన భక్తుడి బాధలన్నీ తొలగిస్తాడని, అలాగే ఎటువంటి కార్యక్రమాలు లైన ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్ముతూ ఉంటారు. వినాయకుడిని సర్వ శక్తివంతుడుగా అలాగే జ్ఞానానికి అధిపతిగా పరిగణించబడ్డాడు. గణపతి నీ సుఖ సంతోషాలు, సంపదలు అందజేస్తాడు.
గణపతి శివపార్వతుల ముద్దుల కొడుకు. అందుకే ఆయనని ఆరాధించడం వలన కలిగే 5 శుభ ఫలితాలు గురించి తెలుసుకుందాం.. అహంకారాన్ని నాశనం చేసే వినాయకుడు: గణేశుడిని పూజించడం వలన మనిషి జీవితంలో అన్ని బాధలు తొలగిపోతాయని.. వ్యక్తి మనసులో అహంకారం కోపం ప్రతికూలత ఉండవని నమ్మకం. వినాయకుడిని పూజించటం వలన ఒక మనిషి తన శక్తులను పొందుతాడని అలాగే ఏ పనులైనా ముందుకి సాగే విధంగా ఆయన అనుగ్రహిస్తాడు. అన్ని బాధలను తొలగించే గణపతి పూజ: వినాయకుడిని పూజించడం వలన వ్యక్తి జీవితంలో అన్ని బాధలు సమస్యలు తొలగిపోతాయి. వినాయకుడు తన భక్తుల కష్టాలను దుఃఖాలను తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. కోరికలను అందించే గణేషుడు: సనాతన సంప్రదాయంలో ఆది పూజ్యుడు గణేశుడు.
వినాయకుని భార్య ఆధ్యాత్మిక శక్తిని సిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. ఈ కార్యములు అయిన ఆటంకం లేకుండా జరుగుతాయి: మనిషి జీవితంలో తమ కార్యక్రమాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికి పూర్తి కావాలని అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి కోరికలు నెరవాలంటే హిందూమతంలో వినాయకుని పూజించాలని నియమం ఒకటి ఉంది. వినాయకుడిని పూజించడం వలన ఎటువంటి పనిలోనైనా ఆటంకాలు తొలుగుతాయని ఆ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసేలా చూస్తాడని అలాగే శుభ ఫలితాలు పొందుతారని నమ్మకం. సంతోషాన్ని సంపదలను ఇచ్చే గణేశుడు: గణపతిని సద్గుణాల దేవుడిగా భావిస్తారు. గణపతిని ఆరాధించటం వలన మనిషి జీవితంలోని అన్ని విషయాలలో ఆనందం శ్రేయస్సు విజయం పొందుతారు. వినాయకుని పూజించడం వలన సాధకుడికి మంచి బుద్ధి బలం కూడా వస్తుంది.