Bigg Boss Telugu 8 : హోరాహోరీగా నామినేషన్స్.. హౌజ్ నుండి బయటకి ఎవరు వెళ్లబోతున్నారు..!
ప్రధానాంశాలు:
Bigg Boss Telugu 8 : హోరాహోరీగా నామినేషన్స్.. హౌజ్ నుండి బయటకి ఎవరు వెళ్లబోతున్నారు..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్‌గా 12 వారాలు పూర్తి చేసుకోగా, ఇప్పుడు 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ జరిగాయి. 12వ వారంలో యష్మి ఎలిమినేట్ కాగా, 13వ వారానికి సంబంధించిన నామినేషన్ జరిగింది. సోమవారం ఎపిసోడ్‌లో ప్రధానంగా నామినేషన్ల ప్రక్రియ సాగగా.. అంత హోరా హోరీగా సాగినట్టు అనిపించలేదు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా నబీల్.. గౌతమ్, విష్ణు ప్రియాలను నామినేట్ చేసాడు. ఒక్కో వారం ఒక్కోలా ఉంటావని, పక్షపాతం ధోరణితో ఉంటావని చెప్పడం నచ్చలేదని నబీల్ అనడంతో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. విష్ణు ప్రియా ఆటలో సీరియస్ నెస్ లేదని తెలిపారు. పృథ్వీతోనే ఉండటం కాదు, ఆట కూడా ఆడాలని తెలిపారు.
Bigg Boss Telugu 8 హోరాహోరీగా నామినేషన్స్..
ఇక పృథ్వీరాజ్.. అవినాష్, గౌతమ్‌లను నామినేట్ చేశాడు. అవినాష్ మెగా చీఫ్‌గా సరిగా చేయలేదని, గౌతమ్ ఏం పీకలేరు అంటూ బూతు పదాలు వాడటం నచ్చలేదని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కూడా డిస్కషన్ గట్టిగానే నడిచింది. ఇక ప్రేరణ.. విష్ణు ప్రియా, గౌతమ్‌లను నామినేట్ చేసింది. గౌతమ్ ప్లానింగ్ ప్రకారం ఆడతాడని, అలానే మాట్లాడతాడంటూ చెప్పుకొచ్చాడు. ఇక తేజ.. విష్ణు ప్రియా, పృథ్వీరాజ్‌లను నామినేట్ చేసాడు. పృథ్వీ వివరణ ఇచ్చేందుకు నో చెప్పడం నవ్వులు పూయించింది. విష్ణుప్రియా.. తేజ, ప్రేరణలను నామినేట్ చేసింది. ప్రేరణ బాడీ లాంగ్వేజ్ రూడ్‌గా ఉందని తెలిపింది విష్ణు ప్రియా.
గౌతమ్.. నిఖిల్, ప్రేరణలను నామినేట్ చేశాడు. ఆడవాళ్లని హార్ష్ గా డీల్ చేయడాన్ని నో చెప్పారు. నిఖిల్ ని నామినేట్ చేసే దాంట్లో తేజ ఇన్‌వాల్వ్ కావడంతో పృథ్వీరాజ్ రియాక్ట్ అయ్యాడు. మధ్యలో డిఫెన్స్ లాయర్‌వా అంటూ అడగడంతో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. ఒకరిపైకి ఒకరు వెళ్లారు. ఒక్కసారిగా వాతావరణ హీటెక్కిపోయింది. అవినాష్.. పృథ్వీ, విష్ణు ప్రియాలను నామినేట్ చేవారు. నిఖిల్.. గౌతమ్, ప్రేరణలను నామినేట్ చేశాడు. రోహిణి..విష్ణు ప్రియా, నబీల్‌ని నామినేట్ చేసింది. మొత్తంగా ఈరోజు ఎపిసోడ్‌లోకొంత ఫైరింగ్ పక్కన పెడితే సాఫీగానే సాగిందని చెప్పొచ్చు. ఇక మొత్తంగా 13వ వారం నామినేషన్ లో విష్ణు ప్రియా, గౌతమ్, నిఖిల్, అవినాష్, తేజ, ప్రేరణ ఇలా ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు. మరి ఈ వారం హౌజ్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం చర్చనీయాంశంగా మారింది.