Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ స్థిరంగా ఉన్నాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4701 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,010 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5129 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,290 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,410 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,720 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,290 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,450 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,290 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,060 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,340 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,290 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,290 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.57.70 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.577 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,700 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.632 కాగా, కిలో వెండి ధర రూ.63200 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.577 కాగా, కిలో వెండి ధర రూ.57700 గా ఉంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.