Tejaswi Madivada : 30 మంది తాగి రౌండప్ చేశారు.. దానికోసమే అంటూ తేజస్వి మదివాడ కామెంట్స్..!
Tejaswi Madivada : సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కుర్ర హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతాకాదు. నటులు కావాలనే వారి కోరికను కొందరు అడ్వాంటేజ్‌గా తీసుకునే రోజులు ఇవి. ఇలాంటి వాటిని దాటి సక్సెస్ ఫుల్‌గా ఇండస్ట్రీలో రాణించేవారు చాలా తక్కువగా ఉంటారు.మరికొంతమంది మాత్రం మోసగాళ్ల చేతిలో బలవుతుంటారు.మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ కొంతమేర తక్కువే అయినప్పటికీ దాని ప్రభావం హీరోయిన్లపై ఎంతమేర ఉంటుందనేది చెప్పడం చాలా కష్టమని నేటితరం హీరోయిన్ తేజస్విని మదివాడ పేర్కొంది.
Tejaswi Madivada : ఆఫర్ల పేరుతో క్యాస్టింగ్ కౌచ్..
క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై నటి తేజస్వి మదివాడ తాజాగా నోరువిప్పింది. సినిమా పరిశ్రమలోనే కాకుండా అన్ని చోట్లా వేధింపులు అనేవి ఇప్పుడు ఎక్కువైపోయాయి. కానీ సినీ ఇండస్ట్రీ ఎప్పుడు హైలెట్ అయ్యే పరిశ్రమ కాబట్టి అందరి చూపు దాని మీదే ఉంటుందని వివరించింది. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే జీవితాల గురించి చాలా తక్కువ టైంలో అందరికీ తెలుస్తాయి. ఇప్పటికే ఎంతోమంది డైరెక్టర్లు, నిర్మాతలు హీరోయిన్లతో తప్పుగా ప్రవర్తించారని చెప్పారు. అందులో కొంతమంది కమిట్ అయితే మరికొంతమంది వారిని ఎదిరించి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎదురైతే సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వీలైతే ఎదిరించాలి.
ఆ టైంలో అవకాశాలకోసం తప్పు చేయకుండా ఎదిరిస్తే ఆ మేటర్ అక్కడికే క్లోజ్ అవుతుంది. కానీ అవకాశాలకోసం వారికి లొంగిపోయి తర్వాత నన్ను మోసం చేశారని అనడం మాత్రం కరెక్ట్ కాదని తేజస్వి కొందరిని ఉద్దేశిస్తూ ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. కాస్టింగ్ కౌచ్ అనేది హీరోయిన్ల మీదే ఆధారపడి ఉంటుంది. మీరు చనువిస్తే ఎదుటి వ్యక్తి అడ్వాంటేజ్ తీసుకుంటాడు.ఒకవేళ ఎదిరిస్తే ఆ మ్యాటర్ అక్కడితో ముగుస్తుంది. నేను కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఒక ఈవెంట్‌కు వెళ్ళినప్పుడు ఒక 30 మంది ఫుల్లుగా తాగేసి వచ్చి నన్ను ఒకేసారి చుట్టుముట్టారు.అప్పుడు వారి నుంచి బయటపడడానికి వారి దగ్గర కొంచెం ఏడ్చి వెళ్ళిపోయానని చెప్పుకొచ్చింది.