National Film Awards 2023 : జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి అవార్డ్.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. ఇంకా అవార్డులు పొందిన నటులు వీళ్లే
National Film Awards 2023 : 69వ జాతీయ అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ అవార్డు వరించింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కి అవార్డు దక్కింది. పుష్ప సినిమాలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నందుకు అల్లు అర్జున్ కు ఈ అవార్డును అందించారు. ఇక.. జాతీయ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సత్తా చాటింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డుల పంట పండింది. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కేటగిరీలో కీరవాణికి అవార్డు వచ్చింది. అలాగే కోరియోగ్రఫీ విభాగంలో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు కింద నాటు నాటు సాంగ్ కి కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ కి అవార్డు రాగా.. స్టంట్ కొరియోగ్రఫర్, స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలలోనూ అవార్డులు వచ్చాయి.
భారత సినీ ఇండస్ట్రీలోనే ఈ అవార్డులకు ప్రత్యేక స్థానం ఉంది. భారత్ లోని వివిధ భాషల్లో సినిమాలు చేసే ప్రతి నటీనటుడికి ఒక్కసారైనా నేషనల్ ఫిలిం అవార్డు అందుకోవాలనే ఆశ ఉంటుంది. ప్రతి సంవత్సరంలాగానే 2023 సంవత్సరానికి సంబంధించిన నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటించగా.. అందులో టాలీవుడ్ సత్తా చాటింది.బెస్ట్ తెలుగు ఫిలింగా ఉప్పెన సినిమా అవార్డు అందుకుంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పుష్ప సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ ను వరించింది.
National Film Awards 2023 : తెలుగు నుంచి అవార్డులు అందుకున్నది వీళ్లే
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, బెస్ట్ ప్లే బ్యాంక్ సింగర్ గా ఆర్ఆర్ఆర్ సినిమాకు అందించిన కాళ భైరవ, ఉత్తమ సినీ గేయ రచయితగా కొండపొలం సినిమాకు పాట రాసిన చంద్రబోస్ ఈ అవార్డులను అందుకున్నారు.ఇక.. ఉత్తమ హీరోయిన్స్ గా గంగూభాయి కతియావాడి సినిమాలో నటించిన అలియా భట్ కి, మిమీ సినిమాలో నటించిన కృతి సనన్ కి లభించాయి. బెస్ట్ మూవీస్ గా ఉత్తమ హిందీ సినిమా సర్దార్ ఉదమ్, బెస్ట్ గుజరాతీ మూవీ చల్లో షో, బెస్ట్ కన్నడ మూవీ 777 చార్లీ, బెస్ట్ మైథిలీ మూవీ సమానంతర్, బెస్ట్ మరాఠీ మూవీ ఏక్దా కాయ్ జాలా, బెస్ట్ మలయాళం మూవీగా హోమ్, బెస్ట్ ఒడియా మూవీగా ప్రతీక్ష, ఉత్తమ తమిళం మూవీగా కదైసి వ్యవసాయి, బెస్ట్ తెలుగు మూవీగా ఉప్పెన అవార్డు గెలుచుకున్నాయి.