Meena : మీనా భ‌ర్త క‌న్నుమూత‌.. క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్న సీనియ‌ర్ న‌టీమ‌ణి

Advertisement

Meena : ప్ర‌ముఖ న‌టి మీనా భ‌ర్త క‌న్నుమూయ‌డంతో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలతో బాధపడిన విద్యాసాగర్‌ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బెంగ‌ళూరుకు చెందిన వ్యాపార‌వేత్త విద్యాసాగ‌ర్‌తో 2009లో మీనా వివాహం జ‌రిగింది. వీరికి ఒక పాప‌. పేరు నైనిక‌. త‌ల‌ప‌తి విజ‌య్ హీరోగా వ‌చ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. మీనా భ‌ర్త మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తూ నివాళులు అర్పించారు. ఈ ఏడాదిలోనే మీనా ఫ్యామిలీ అంతా క‌రోనా బారిన ప‌డ‌గా, కొద్ది రోజుల‌కి అంతా కోలుకున్నారు. కాని ఇప్పుడు ఆయ‌న ఇలా మృతి చెందడం అబిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది.

Meena : మీనా ప‌రిస్థితి ఏంటి?

కొన్ని వారాల క్రితం వైద్యులు విద్యాసాగర్ ఊపిరితిత్తులను మార్పిడి చేయాలని సూచించారు. అయితే బ్రెయిన్ డెడ్ రోగుల నుండి మాత్రమే సాధ్యమవుతుందని మరియు వేచి ఉన్న వారి జాబితా పెద్దది కాబట్టి దాతను పొందడంలో ఇబ్బంది ఉందని వర్గాలు పేర్కొన్నాయి. వైద్యులు అప్పుడు మందులతో పరిస్థితిని నయం చేయడానికి ప్రయత్నించారు. అయితే ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ కావ‌డంతో నిన్న రాత్రి మృతి చెందారు.

Advertisement
Actress meenas husband vidyasagar passes away
Actress meenas husband vidyasagar passes away

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో మీనా, ఆమె కుమార్తెకు సంతాపం తెలుపుతూ పోస్ట్ చేశారు. అంత్యక్రియలు బుధవారం జూన్ 29వ తేదీన జరుగుతాయని సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనతో సినిమా రంగంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మీనా అప్పుడ‌ప్పుడు పలు సినిమాల‌లో న‌టిస్తూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు త‌న ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా అందిస్తూ వ‌చ్చింది. ఆమె భ‌ర్త మ‌ర‌ణించ‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. బెంగ‌ళూరుకు చెందిన వ్యాపార‌వేత్త విద్యాసాగ‌ర్‌తో 2009లో మీనా వివాహం జ‌రిగింది. వీరికి ఒక పాప‌. పేరు నైనిక‌. త‌ల‌ప‌తి విజ‌య్ హీరోగా వ‌చ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది.

Advertisement
Advertisement