Navya Swamy : నువ్ లేకుండా బతకలేను!.. గుట్టు విప్పిన సీరియల్ నటి నవ్యస్వామి
Navya Swamy : బుల్లితెరపై తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ రావడం చాలా కష్టం. కొన్నేళ్లు ఎవ్వరికీ తెలియకుండా అలా కష్టపడుతూనే ఉంటారు. అలా కష్టాన్ని నమ్ముకుని ఉంటే ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతుంటారు. వెలుగులోకి వస్తారు. అలా నవ్యస్వామి చాలా సీరియల్స్ చేస్తూ వచ్చింది. నా పేరు మీనాక్షితో పాపులర్ అయింది. ఆ తరువాత ఆమె కథ సీరియల్‌తో ఫుల్ ఫేమస్ అయింది. ఆ సీరియల్‌లో రవికృష్ణతో కుదిరిన కెమిస్ట్రీతో మరింత ఫేమస్ అయింది.

Actress Navya Swamy About Hariteja
ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో రెచ్చిపోయారు. అలా ఈ ఇద్దరి మీద ప్రేమ, పెళ్లిళ్ల వార్తలు వచ్చాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులమేనని చెప్పుకొచ్చారు. అయితే నవ్యస్వామికి ఇండస్ట్రీలో అతి తక్కువ మంది స్నేహితులున్నారట. ఈ విషయాలన్నీ కూడా నవ్యస్వామి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు హరితేజ ఫ్యామిలీ చాలా దగ్గర. హరితేజ భర్త కన్నడ వాడు. అలా మాకు మరింత స్నేహం ఏర్పడింది. నేను వాళ్లతో ఇంట్లో మనిషిలా అయిపోయాను అని చెప్పింది.
Navya Swamy వీకెండ్ పార్టీలో నవ్యస్వామి, హరితేజ

Actress Navya Swamy About Hariteja
ఇక నవ్యస్వామి, హరితేజ, కస్తూరీ ఫేమ్ ఐశ్వర్యలు వీకెండ్‌లో నానా హంగామా చేస్తుంటారు. అయితే నవ్య స్వామి, హరితేజలు మరింత క్లోజ్‌గా ఉంటారు. నిన్న వీకెండ్ పార్టీలో ఈ ముగ్గురు రచ్చ చేసినట్టున్నారు. నువ్ లేకుండా వీకెండ్ పార్టీలో నేను ఎలా బతగలను. ఎలా ఉండగలను అని హరితేజ మీద తన ప్రేమను కురిపించింది నవ్యస్వామి. అయ్యే నువ్ లేకపోయినా నేను మాత్రం ఉండగలను అంటూ నవ్యస్వామికి కౌంటర్లు వేసింది హరితేజ.