Adah Sharma : కేరళా స్టోరీ లో ఎందుకు నటించావే .. డాష్ దానా అంటూ అదా శర్మ మీద చంపేస్తాము అని బెదిరింపులు !

Advertisement

Adah Sharma : తెలుగులో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది ఆదాశర్మ. ఈ సినిమా తర్వాత ఆదాశర్మ రెండు మూడు సినిమాలు చేసింది. కానీ అవి అంతగా సక్సెస్ కాలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ వేరే భాషలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఇటీవల ‘ ది కేరళ స్టోరీ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ప్రమాదకర ఐఎస్ఐఎస్ ప్రమేయంతో బలవంతంగా ఇస్లాం మతంలో మారే అమ్మాయిల కథగా తెరకెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రమిది. ఈ సినిమాలో ముస్లింలా మారిన హిందూ అమ్మాయిగా తన నటనతో ఆదాశర్మ అందరినీ ఆకట్టుకుంది.

adah sharma the kerala story issue
adah sharma the kerala story issue

అయితే మతానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రభావితం చేసే బలమైన అంశం కావడంతో నటీనటులు మేకర్స్ తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నారు. దీంతో ఆదా శర్మ ఇబ్బందుల్లో పడినట్లు అయింది. ఆమె వ్యక్తిగత వివరాలను ఫోన్ నెంబర్ నం ఆన్లైన్లో లీక్ చేస్తామని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు బెదిరిస్తున్నారు. ఒక ఇంస్టాగ్రామ్ వినియోగదారుడు ఆదా శర్మ వ్యక్తిగత సమాచారం సహా ఫోన్ నెంబర్ ను లైక్ చేస్తానని బెదిరించాడు. ఇక jamunda bolte అనే పేరుతో సోషల్ మీడియాలో ఒక వ్యక్తి హల్చల్ చేయడాన్ని గుర్తించారు. కేరళ స్టోరీ బనాతి అబ్ హైదరాబాద్ బచ్చి తేరి స్టోరీ బనాతే అని రాసి ఉన్న తన వాట్సాప్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తూ అతడు పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చాడు.

Advertisement

Adah Sharma on playing lead role in The Kerala Story: 'The character has  physically and emotionally scarred me' | Entertainment News,The Indian  Express

దీంతో ఆ వ్యక్తి హైదరాబాద్ కు చెందిన వాడని స్పష్టమైంది. తాజా సమాచారం మేరకు ఆ ఇంస్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయింది. అయితే అతడి పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. దీంతో ఆదాశర్మకు మద్దతుగా ఆ దుష్టునిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ముంబై సైబర్ సెల్ ఫాన్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ వార్తలపై ఇంతవరకు అదా శర్మ స్పందించలేదు. అయితే ది కేరళ స్టోరీ నటీనటులు, సిబ్బందిని వేదించడం ఇది మొదటిసారి కాదు. గతంలో డైరెక్టర్ సుదీప్తో సేన్ తనకు ఎదురైన బెదిరింపుల గురించి గత ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతడికి అజ్ఞాతవాసి నుంచి బెదిరింపు సందేశం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement
Advertisement