Adipurush : ఇప్పుడు మాట్లాడండి రా.. ఆదిపురుష్ ఫ్లాప్ అని వాగిన వాళ్లకు దవడ పగిలే బ్రేకింగ్ న్యూస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Adipurush : ఇప్పుడు మాట్లాడండి రా.. ఆదిపురుష్ ఫ్లాప్ అని వాగిన వాళ్లకు దవడ పగిలే బ్రేకింగ్ న్యూస్

 Authored By sandeep | The Telugu News | Updated on :9 October 2022,3:30 pm

Adipurush : ఆదిపురుష్ టీజర్ విడుదలైన రోజు నుంచి ఈ సినిమా మీద దారుణమైన ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి ఒక బొమ్మల సినిమా చేస్తారా.. ప్రభాస్ ను అనవసరంగా ఈ సినిమాలో హీరోగా తీసుకున్నారు.. ఆయన ఇమేజ్ పాడు చేయడానికి దర్శకుడు ఓం రౌత్ ఇలాంటి చిన్నపిల్లల సినిమా చేశాడు.. ఆయన గాని మాకు దొరికితే కచ్చితంగా కొడతాం అంటూ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టీజర్ చూసిన తర్వాత అందరికీ దాదాపు ఇదే అభిప్రాయం వచ్చింది. అయితే 3d లో టీజర్ ప్రదర్శించిన తర్వాత ఆదిపురుష్ పై అంచనాలు మారిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చెప్పండి రా ఎవడు ఆదిపురుష్ సినిమాను ఫ్లాప్ అంటున్నది..

ఒక్కసారి త్రీడీలో చూడండి అప్పుడు తెలుస్తుంది ఈ సినిమా విలువ అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. పైగా ఈ సినిమా కోసం ఇండియాలో ఇప్పటి వరకు మరే సినిమాకు వాడని ఒక కొత్త టెక్నాలజీని వాడారు దర్శక నిర్మాతలు. కేవలం హాలీవుడ్ సినిమాలో మాత్రమే చూసే కటింగ్ ఎడ్జ్ అనే టెక్నాలజీ ఆదిపురుష్ సినిమా కోసం వాడారు. బాహుబలి తర్వాత ప్రభాస్ దృష్టి కేవలం బాలీవుడ్ మీదే ఉంది. అందుకే అక్కడి ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని కథలు ఎంచుకుంటున్నాడు. ఈసారి మాత్రం రామాయణం సరికొత్తగా ప్రేక్షకులకు చెప్పాలని దర్శకుడు ఓం ప్రయత్నానికి.. ప్రభాస్ కూడా జత కలిశాడు. ఈ ఇద్దరు కలిసి దాదాపు 500 కోట్లతో ఆదిపురుష్ సినిమాను ప్లాన్ చేశారు. వీళ్ళిద్దరికీ టి సిరీస్ భూషణ్ కుమార్ తో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు కూడా తోడు కావడంతో.. ముంబైలో అతిపెద్ద గ్రీన్ మ్యాట్ సెటప్ లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఆదిపురుష్ సినిమాను పూర్తి చేశాడు దర్శకుడు.

Aadipurush movie creates sensation

Aadipurush movie creates sensation

Adipurush : ఇండియాలోనే ఫస్ట్ టైమ్..

ఈ చిత్రాన్ని మోషన్ క్యాప్చర్ సహాయంతో ‘కట్టింగ్ ఎడ్జ్’ అనే టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ సాంకేతికతను ఎక్కువగా హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ఉపయోగిస్తారు. ఆదిపురుష్ సినిమాలో ఉన్న ప్రాధాన్యతను గమనించిన నిర్మాణ సంస్థ టీ-సిరీస్ మొదటిసారిగా ఈ టెక్నాలజీని ఇండియాకు తీసుకువచ్చింది. అక్కడ ఉన్నది మోషన్ క్యాప్చర్ తో తీసిన సినిమాని అయినా కూడా ఒకసారి బిగ్ స్క్రీన్ మీద చూస్తే అనుభూతి వేరేలా ఉంటుందని.. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాదు సంచలన విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 12 2023న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఇండియాలో కొన్ని థియేటర్స్ ఆ టెక్నాలజీతో ముస్తాబవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది