Jabardast : ఆహా.. జబర్దస్త్‌ కు సరైన పోటీ ఇదే అవ్వనుందేమో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardast : ఆహా.. జబర్దస్త్‌ కు సరైన పోటీ ఇదే అవ్వనుందేమో

 Authored By prabhas | The Telugu News | Updated on :22 February 2022,8:00 pm

Jabardast : ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే ఉండేవి. అంతకు ముందు అవి కూడా లేవు అనుకోండి. ఆ విషయాన్ని వదిలేస్తే.. సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న రోజుల్లో బుల్లి తెర వచ్చి అనూహ్యంగా ఇంటికి ఎంటర్టైన్మెంట్ ను తీసుకు వచ్చింది. ఆ తర్వాత సినిమాల ప్రభావం తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ బుల్లి తెర వచ్చినా కూడా వెండి తెర మాత్రం తగ్గలేదు. బుల్లి తెర మరియు వెండి తెర రెండు కూడా సమాన విజయాలను దక్కించుకుంటూ సక్సెస్ అయ్యాయి. ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడంలో రెండు కూడా విజయం సాధించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్‌ లు ఈ రెండింటికి పోటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగాయి.

గతంలో మాదిరిగా అన్ని సమాన విజయాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్తాయి అని అనుకున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మరియు బుల్లితెర ఇండస్ట్రీ పై ఓటీటీ ప్రభావం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు తరహాలో సినిమాల కోసం థియేటర్లకు వెళ్లడం లేదు. అలాగే సీరియళ్ల కోసం టీవీ చానల్స్ ను అధికంగా పెట్టడం లేదు. ప్రతి ఒక్కరు ఓటీటీ ని ఆశ్రయిస్తున్నారు. వీకెండ్స్ లో ఎక్కువగా ఓటీటీ లో ఉన్న కంటెంట్ ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా టాక్ షో లు మరియు రియాల్టీ షో లు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ షోలో ఒకప్పుడు కేవలం బుల్లి తెరపై మాత్రమే కనిపించేవి. ఇప్పుడు ఓటీటీ లపై కూడా కనిపించబోతున్న నేపథ్యంలో అతి త్వరలోనే బుల్లి తెరకు రోజులు దగ్గర పడ్డాయి అన్నట్లుగా అనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

aha ott planning a comedy show to give to jabardast

aha ott planning a comedy show to give to jabardast

. ఆహా ఓటిటి లో ఇప్పటికే బాలకృష్ణ మరియు సమంతల టాక్ షోలు నిర్వహించి సక్సెస్ అయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ రాబోతుంది. తాజాగా ఆహ ఓటీటీ వారు సింగింగ్‌ కాంపిటీషన్ ప్రారంభించారు. తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ సింగింగ్ రియాల్టీ షో ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. థమన్‌ మరియు నిత్య మీనన్ లు ఈ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా స్పందన రాబోతుంది. షో సూపర్ హిట్‌ అవ్వడం ఖాయం అంటున్నారు. అదే కనుక జరిగితే రాబోయే కాలంలో కామెడీ షోలు కూడా ఆహా ఓటీటీ లో వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే జబర్దస్త్ కు అది సరైన పోటీ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది