Bigg Boss Non Stop : అజయ్ కి పడిపోయిన అరియానా.. లవ్ ట్రాక్ స్టార్ట్.. అప్పుడు అవినాష్.. ఇప్పుడు అజయ్
Biggboss Non Stop : మీకు గుర్తుందా.. బిగ్ బాస్ సీజన్ 4లో అరియానా, అవినాష్ లవ్ ట్రాక్ తెలుసు కదా. హౌస్ లో ఉన్నంత సేపు వాళ్ల మధ్య జరిగిన లవ్ ట్రాక్ అందరికీ నచ్చింది. దీంతో బయటికి వచ్చాక అది అలాగే కంటిన్యూ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. అది కంటిన్యూ కాలేదు. ఇద్దరూ విడిపోయారు. అవినాష్ వేరే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు.
ajay and ariyana love track started in bigg boss non stop
కట్ చేస్తే.. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలోకి అరియానా ఎంట్రీ ఇచ్చింది. రావడం రావడమే.. రెండు రోజులకే హౌస్ లో ఉన్న చాలెంజర్ అజయ్ ని చూసి పడిపోయింది. చాలెంజర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ అజయే. అజయ్ సినిమా నటుడు. ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో నటించాడు.
Biggboss Non Stop : అజయ్ అందానికి అరియానా ఫ్లాట్ అయిందా?
చూడటానికి తెల్లగా, హైట్ తో అజయ్ ఉండటంతో పాటు.. అందరితోనూ మంచిగా ఉంటూ.. మంచి పిల్లాడు అని అజయ్ అనిపించుకుంటున్నాడు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి రెండు రోజులు అయిన సందర్భంగా వారియర్స్, చాలెంజర్స్ వీళ్లకు ఎవరిలో అనుబంధం ఏర్పడింది. ఎవరితో ఉంటే బాగుంటుంది అని అనిపించిందో వాళ్ల పేరు చెప్పి.. ఎందుకు వాళ్లను ఎంచుకున్నారో చెప్పాలంటూ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు.
ajay and ariyana love track started in bigg boss non stop
దీంతో అరియానా.. ఏమాత్రం గుక్కతిప్పుకోకుండా అజయ్ పేరు చెప్పేసింది. తెల్లచొక్కా.. స్టార్టింగ్ నుంచి అజయ్ వైబ్ నచ్చింది. ఆయన వైబ్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. స్పాంటెనిటీ కూడా నచ్చింది అని చెబుతుంది అరియానా. దీంతో అఖిల్, ముమైత్ ఖాన్.. ఇద్దరిని చూసి నవ్వుకున్నారు.