Allu Aravind : RRR ఆస్కార్ సత్కార్ వేదికపై రాజమౌళి పై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 10 April 2023, 8:00 pm

Allu Aravind : హైదరాబాద్ లో “RRR” ఆస్కార్ విజేతులను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ RRR.. సినిమా దర్శకుడు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ మరి కొంతమంది టెక్నీషియన్స్ పాల్గొన్నారు. వీళ్ళతోపాటు గీత ఆర్ట్స్ అధినేత నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆస్కార్ గొప్పతనం గురించి ఇంకా కీరవాణి.. సినిమా ఇండస్ట్రీలో రావడం కుర్రోడిగా..

Allu Aravind & Allu Arjun Hatch A Plan For Future!

ఉన్న సమయంలో మ్యూజిక్ దర్శకుడిగా సినిమాలపై ఆయనకున్న ప్రేమను అల్లు అరవింద్ తనదైన శైలిలో వివరించారు. ఇక ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళి పై అల్లు అరవింద్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు చలనచిత్రం పరిశ్రమలు ప్రపంచ శిఖరాగ్రస్థాయికి రాజమౌళి తీసుకెళ్లారని అభివర్ణించారు. అటువంటి రాజమౌళి దర్శకత్వంలో “మగధీర” సినిమాని నిర్మించినందుకు చాలా గర్వపడుతున్నట్లు అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

Allu Aravind Requests SS Rajamouli At RRR Oscar Veduka

Allu Aravind Requests SS Rajamouli At RRR Oscar Veduka

ఒకానొక టైంలో అమెరికా వెళ్లిన సమయంలో ఆస్కార్ అందుకోవటం అసాధ్యం. కనీసం ఆస్కార్ ఇచ్చే ప్రదేశాన్ని చూడాలని అప్పట్లో పరితపించాను. ఆస్కార్ అందుకోవటం అసాధ్యం అనే పరిస్థితిని రాజమౌళి సుసాధ్యం చేశారని అన్నారు. RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు. ఇదే సమయంలో సినిమా నిర్మాత డివివి దానయ్యనీ కూడా అల్లు అరవింద్ ప్రశంసించారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp