Allu Arjun : వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన బన్ని.. ఎక్కడంటే?
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో ఇంతింతై వటుడింతై అన్న మాదిరిగా ఎదిగారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు తనను తాను ఇంప్రూవ్ చేసుకుని టాప్ హీరో అయిపోయారు బన్ని. తాజాగా బన్ని వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఎక్కడంటే..తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జనవాడ గ్రామంలో బన్ని రెండు ఎకరాల పొలం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శంకర్‌పల్లి తహసీల్దారు కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం బన్ని వచ్చారు.
ఈ క్రమంలోనే శంకర్‌పల్లి మండల తహసీల్దారు సైదులు అల్లు అర్జున్ భూమి కొనుగోలు చేసినట్లు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు. బన్ని కొనుగోలు చేసిన సదరు వ్యవసాయ భూమి విలువ రూ.లక్షల్లో ఉంటుందని స్థానికులు అంటున్నారు. శంకర్ పల్లి మండల తహసీల్దారు ఆఫీసుకు బన్ని వచ్చాడని తెలుసుకుని మెగా అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చారు. దాంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. బన్నితో ఫొటోలు దిగేందుకుగాను మెగా అభిమానులు ఎగబడ్డారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా వస్తోంది.
Allu Arjun : ‘పుష్ప’ రాజ్‌తో ఫొటోలు దిగేందుకు ఎగబడిన అభిమానులు..
ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నెటిజన్లు, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవడంతో పాటు ఐకాన్ స్టార్ అవడం విశేషం. ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఈ మూవీ ద్వారా ఐకాన్ స్టార్ కాబోతున్నారు.ఇకపోతే గతంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ -బన్ని కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య-2’ చిత్రాలు సూపర్ హిట్ కాగా హ్యాట్రిక్ ఫిల్మ్‌గా ‘పుష్ప’ రాబోతున్నది. ఈ చిత్రంలో బన్ని సరసన క్యూట్ హీరోయిన్ రష్మిక మందన నటిస్తోంది. ‘పుష్పరాజ్’గా బన్ని, ‘శ్రీవల్లి’గా రష్మిక మందన ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారు.