‘పుష్ప’లో అల్లు శిరీష్.. పిక్ వైరల్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిహారిక పెళ్లికి వెళ్లడంతో మూడు రోజులు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అసలే ఆలస్యమవుతూ వచ్చిన పుష్ప నిరంతరాయంగా షూటింగ్ చేయాలని ఫిక్స్ అయింది. అందుకు పెళ్లి నుంచి తిరిగి వచ్చిన బన్నీ నేరుగా సెట్‌మీదకు వెళ్లినట్టు తెలుస్తోంది. మెగా హీరోలందరూ కూడా మళ్లీ ఎవరి పనుల్లో వారు పడ్డారు. షూటింగ్‌లు, వర్కవుట్లు మళ్లీ బిజీ అయ్యారు.

Allu Sirish at Allu Arjun Pushpa Set
అల్లు శిరీష్ అయితే ఏకంగా ఎయిర్ పోర్ట్ నుంచి జిమ్‌లోకి వెళ్లానని చెప్పుకొచ్చాడు. మూడు రోజులు పార్టీలో ఎంజాయ్ చేశాను అందుకే నేరుగా ఇక్కడికే వచ్చాను అంటూ జిమ్ చేస్తోన్న వీడియోను షేర్ చేశాడు. అల్లు శిరీష్ తాజాగా పుష్ప సెట్‌లోకి వెళ్లినట్టున్నాడు. పుష్ప క్యారవాన్‌లో పోజిలిస్తూ రచ్చ చేశాడు. పుష్ప సెట్‌లో ఊరికే వెళ్లాడా? లేదా ఏదైనా కారణం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. కొంపదీసి అల్లు బ్రదర్స్ కలిసి నటించడం లేదు కదా? అని నెటిజన్లు చెవులు కొరుక్కంటున్నారు.
చిల్లింగ్ ఎట్ పుష్ప వానిటీ వ్యాన్ టుడే అంటూ అల్లు శిరీష్ పోస్ట్ చేసిన పిక్, బ్యాక్ గ్రౌండ్‌లో పుష్ప పోస్టర్ రెండూ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి బన్నీ త్వరగా సెట్స్ మీదకు వెళ్లాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రష్మిక మందన్నా ఈ మూవీ షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టనేలేదు. వచ్చే ఏడాది నుంచి సుకుమార్ ఈ ఇద్దరి కాంబోలో సీన్స్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.