Ananya Pandey : ఏమందం ఇది..చ‌లికాలంలో కాక రేపుతుందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ananya Pandey : ఏమందం ఇది..చ‌లికాలంలో కాక రేపుతుందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 January 2022,2:40 pm

Ananya Pandey : బాలీవుడ్‌లో నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వెండితెరపై అందాలతో జిగేల్ అనిపిస్తున్న యువ హీరోయిన్ అనన్య పాండే. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం గ్లామర్‌కు, పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకొంటూ తనదైన శైలిలో ప్రేక్షకుల హృదయాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటుంది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ఓ డాన్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తారట. అనన్య పాండే కథానాయికగా క్యూషియ‌ల్ పాత్ర‌లో నటిస్తోంది.ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజయ్ డాన్ కొడుకుగా కనిపిస్తాడట.

తండ్రి కొడుకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది.సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌న్య ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ర‌చ్చ చేస్తుంటుంది. రెట్టింపు అందచందాలతో.. అదరగొడుతున్న అనన్య.. హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తుంది.ఎక్కువగా బీచ్ యాత్రలు చేస్తున్న అనన్య.. సముద్రపు ఒడ్డున సొగసులను ఆరబెట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వయ్యారాలను వండి వడ్డిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హోయ‌లు పోతూ రెచ్చిపోయింది.

ananya pandey chilling looks viral

ananya pandey chilling looks viral

Ananya Pandey : ఏమందం ఇది..!

ఇలా అయితే ఎలా అనన్య.. నెట్టింట్లో ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ళు ఏమైపోవాలి..? ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూ.. చంపేస్తుంది సుందరి.సోషల్ మీడియాలో తిరుగు లేని క్రేజ్ సాధించిన అనన్య పాండే .. ఇప్పటికే ఇన్ స్టా లో 28 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిస్స్ సోషల్ మీడియాలో క్రేజ్ తో పాటు.. ఫాలోవర్స్ ను సంపాదించాలి అంటే.. చాలా టైమ్ పడుతుంది. కాని చాలా తక్కువ టైమ్ లో అనన్య ఈ క్రేజ్ ను సాధించేసింది. అందాల ప్రదర్శనలో తగ్గేదే లే.. అంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది