Anasuya : అమాంతం ఎత్తేశాడు.. నిఖిల్ దెబ్బకు భయపడ్డ అనసూయ
Anasuya : బుల్లితెరపై పండుగ ఈవెంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ప్రతీ పండుగకు ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటివి కొత్త కొత్త ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటాయి. ఇందులో మరీ ముఖ్యంగా అంటే.. ఈటీవీ, స్టార్ మా చానెళ్లు విపరీతంగా పోటీ పడుతుంటాయి. ఈ ఉగాదికి సైతం ఈటీవీ, స్టార్ మా మధ్య పోటీ ఉండేట్టు కనిపిస్తోంది.ఈటీవీలో అంగరంగ వైభవంగ అనే షో రాబోతోంది. ఇది వరకే మూడు ప్రోమోలను వదిలారు. అందులో జీవిత రాజశేఖర్ ముఖ్య అతిథులుగా రాబోతోన్నారు. ఇక స్టార్ మాలో రాబోతోన్న ఆగట్టునుంటావా? ఈగట్టుకొస్తావా?
ఈవెంట్‌లో సీరియల్ తారలే ఉన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఎప్పటిలానే వాడేస్తున్నారు.అయితే ఇందులో మాత్రం అనసూయ కాస్త స్పెషల్‌గా కనిపిస్తోంది. ట్రెడిషన్ వర్సెస్ ట్రెండ్ అన్నట్టుగా సాగుతోంది ఈ ఈవెంట్. ట్రెడిషన్ తరుపున రవి.. ట్రెండ్ తరుపున సన్నీ హోస్టింగ్ చేస్తూ వచ్చారు. అయితే అనసూయ మాత్రం స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. అనసూయ అంటే ట్రెడిషనల్ అని రవి చెబుతూ చీరకట్టులోని ఫోటోను చూపిస్తాడు.

Anasuya And Nikhil In Star Maa Ugadi 2022 Event
Anasuya : అనసూయను ఎత్తుకున్న నిఖిల్..
ఇక అనసూయ ట్రెండ్ అన్నట్టుగా మోడ్రన్ ఫోటోను చూపిస్తాడు సన్నీ. అసలు ఈ గొడవలెందుకు అన్నట్టుగా అనసూయ చెబుతుంది. మరో చోట అయితే యూట్యూబర్ నిఖిల్ అయితే అనసూయను ఏకంగా ఎత్తుకున్నాడు. దీంతో అనసూయ ఒక్కసారిగా భయపడింది. మరి ట్రెండ్ గొప్పది అని చెప్పు అంటూ భయపెట్టేశాడు నిఖిల్. మొత్తానికి అనసూయ ఎంట్రీతో ఈ ఈవెంట్ ఎలా క్లిక్ అవుతుందో చూడాలి.
